21, డిసెంబర్ 2015, సోమవారం

మనం యిక్కడే !

మన  సమాజం  మానవ  సమాజం !ఏ  ఖండం  లో  వున్నా  యే  దేశం  లో  వున్నా  అందరి  భావాలూ   ,భావప్రకటనా  ఒకే  విధంగా  వుంటాయి . ఆలోచనా  విధానం  కూడా   ఒకే  రకంగా  వుంటుంది . కాకపోతే  ఆయా  పరిసరాల  భాషల   వాతావరణ  పరిస్తితుల  వల్ల  వారి  ప్రవర్తన  వారికి  అనుకూలం గా  మార్చుకుంటారు . నేను
యెందుకు  యిలా  అలోచిస్తున్నానంటే  సాధారణంగా  పల్లెటూరి   వ్యక్తికీ ,పట్టణ వ్యక్తికీ ,పెద్దనగరంలో  వుండే వ్యక్తికీ  మరో దేశంలో    వుండే వ్యక్తికీ  మానసిక ,శారీరిక స్తితి  ఒకటే  కానీ  తను  వున్న సమాజాన్ని  బట్టి  తప్పని  సరిగా
తాను  మారాలి ,లేకపోతే  ఆ  వాతావరణంలో  యిమడ లేడు . నేను  పల్లెటూరిలో  పుట్టాను ,మా వూళ్ళో  అన్నీ  చిన్న  చిన్న  యిళ్ళు ,దగ్గర  దగ్గరగా  వుండేవి .  తెల్ల తెల్ల వారు తుండగానే  అందరూ  లేవల్సిందే !మా  అమ్మ
నేను  కళ్ళు  తెరచి చుసేటప్పటికే  స్నానం  పూజా  ముగించి  వంట దగ్గర  వుండేది . బామ్మా  యేదో  పని  చేస్తూనే
వుండేది ,మాతాతయ్య  కూడా  బజారు  పని చేస్తూ  వుండేవారు . నాన్న  బడి కి  సైకిల్  మీద  వెళ్ళేవారు . నేను
అన్నయ్య  అన్నం క్యారియర్  తీసుకుని  బడికి  నడుచుకుంటూ  వెళ్ళేవాళ్ళం .    ఆరోజుల్లో  చాలా  శుభ్రంగా
వుండేది . మా మాస్టార్లు  యెంతో  నిదానంగా  కోప్పడకుండా  పాఠాలు  చెప్పేవారు .  మా  చదువంతా  యెంతో  హయిగా  సాగింది .  మాకు  tutions  లేవు , యేదయినా  అర్ధం  కాకపోతే  నాన్న  చెప్పేవారు . సాయంకాలం
యింటికి  రాగానే  కాసేపు  బామ్మ  దగ్గర  కూర్చుని  కబుర్లు  చెప్పేవాళ్ళం ,కాళ్ళు  చేతులు  కడుక్కుని  బట్టలు  మార్చుకుని  చుట్టు  పక్కల  పిల్లలందరం  కలిసి  రకరకాల  ఆటలు  ఆడేవాళ్ళం ,కొద్దిగా  వెలుతురు  వుండగానే
యింటికి  వచ్చేవాళ్ళం !మళ్లీ  కాళ్ళు  కడుక్కుని  మాస్టార్లు  యిచ్చిన  పాఠాలు  చదువుకొని  హోంవర్క్  చేసుకుని
భోజనానికి  సిద్ధం !నాన్న ,నేను ,అన్నయ్య  ఒకేసారి  తినే  వాళ్ళం ,అప్పుడు  నాన్న  బళ్ళో  పాఠాలు  గురించి
అడిగేవారు ,మమ్మల్ని  అన్నం  తిన్నతర్వాత  మన  దేశాన్ని  గురించి  నాయకుల  గురించి ,మంచి  అలవాట్ల
గురించి  చెప్పేవారు ,మాకు  అవన్నీ  వింటుంటే  యేదో  తెలియని  భావాలూ  వచ్చేవి .!యీ  లోగా  అమ్మ ,బామ్మ
అన్నాలు  తిని  వంటిల్లు  శుభ్రం  చేసి  బయటకు  వచ్చేవారు .!నేను  బామ్మ  దగ్గర ,అన్నయ్య  తాతయ్య  దగ్గర
పడుకునే  వాళ్ళం !తాతయ్య ,బామ్మా  మాకు  రామాయణం  మహాభారతం  కథలు  చెప్పేవాళ్ళు ,మధ్య  మధ్య
ప్రశ్నలు  వేసేవాళ్ళు ,అలా  అలా  వింటూ  నిద్ర  పోయేవాళ్ళం !
ఇంతకూ  నేను  చెప్ప బోయేది ,అది  పల్లెటూరి  జీవనం !మా  పెళ్ళిళ్ళు  అయిపోయి  పట్టణానికి  వ  చ్చాం !మా
అమ్మా  నాన్న  మాతోనే  వచ్చారు ,కాలధర్మం  బామ్మా  తాతయ్య  వెళ్ళిపోయారు .  అన్నయ్య ,వదిన ,నేను  మా
ఆవిడా ,నాన్న  అమ్మా ,నాలుగు  గదుల  యిల్లు  అద్దెకు  తీసుకుని  వున్నాం !అమ్మ  వయసు పెరిగినా  తెల్లారంగనే  నిద్ర  లేచి  పనులు  మొదలు  పెట్టేది ,నేను  అన్నయ్య  యెంత వద్దన్నా  వినేది  కాదు .,మా  వదినకు
ప్రతి  పనీ  వివరంగా  కావాలి  అందువల్ల  యే దీ  త్వరగా  అయ్యేది  కాదు ,చిక్కులు  మొదలయ్యాయి !ఒకరోజు
నాన్న  అందరినీ  సమావేశ పరిచారు .,అందరికీ  వారి  వారి  భాద్యతలు  చెప్పారు .!వదిన  వుదయాన్నే  లేచి
స్నానంముగించుకొని  వంటకు  వెళ్ళాలి ,మా  ఆవిడ  వదినకు  సాయం  చెయ్యాలి ,అన్నయ్య  బజారు  సరుకులు
తేవాలి ,నేను   అమ్మకు  నాన్నకు  సాయం  చెయ్యాలి !అన్నయ్యకు  కవల  పిల్లలు  పుట్టారు ,కొత్త  సభ్యుల
రాకతో వాతావరణమే  మారింది .అవసరాలు  మారాయి ,వదిన  పిల్లల్ని  చూసుకుంటూ  పని  చేసుకోవడం
కష్టం  అయింది ,అమ్మకు  ఓపిక  తగ్గింది . క్రమంగా  వదినకు  పని  యెక్కువ  అయి  విసుగు  వచ్చేది , ఇంట్లో
చికాకులు  మొదలయ్యాయి .  ఒకరోజు  నాన్నకు  గుండెపోటు  వచ్చి  కూర్చున్న  వారు  కుర్చున్నట్టుగానే  పోయారు అన్నయ్యకు  బదిలీ  ,అన్నయ్య,వదిన  పిల్లలు  మరో  పెద్ద  నగరానికి  వెళ్లారు ,నేను  మా  ఆవిడా  అమ్మ ఒకచోట  వున్నాము మొదటి  సారి  ఒకటిగా  వున్న  కుటుంబం  రెండుగా  అయింది /అన్నయ్య  పిల్లలు  ఇంగ్లీష్  మీడియం  బళ్ళో  చేరారు /స్కూల్  బస్సు  వచ్చేది /వదిన  మిక్సీ  గ్రైన్దర్  కొనుక్కున్నది /అన్నయ్య
కారు  కొనుక్కున్నాడు /జీవన  విధానం  మారింది /కానీ  పిల్లల  పెంపకం  బాగుండేది /బాగా  చదువుకుని
డిగ్రీ  పూర్తి  కాగానే  అమెరికా  వెళ్ళిపోయారు /నాకు  ఆడపిల్ల  పుట్టింది /అమ్మ  పెంపకం లో  పద్దతిగా  పెరిగింది
బాగా  చదువుకుంది /నా  స్నేహితుడి  కొడుకు  సూర్యం  బ్యాంకు లో  పని  చేస్తున్నాడు ,మా  అమ్మాయి  నచ్చింది /అన్నయ్య ,వదిన  పిల్లలు  వచ్చారు /వున్నంతలో  పెళ్లి  చేసాను /అతనికి  డిల్లీ  లో వుద్యోగం /అన్నయ్య  పిల్లలు
అమెరికాలో  స్థిరపడ్డారు /కాలక్రమంలో  అక్కడి   వాళ్ళను  పెళ్లి  చేసుకున్నారు /ఇప్పుడు  నేను  అన్నయ్య  వదిన
మా  ఆవిడా ,అమ్మా  కలిసి  వున్నాం /అమ్మ  యీ  మధ్యనే  కాలధర్మం  చేసింది /
నేను  యెందుకు  వ్రాస్తున్నానంటే  జీవితం  చక్రభ్రమణం /తిరిగి  అక్కడే  మొదలు !

17, డిసెంబర్ 2015, గురువారం

swami vivekananda says,
You have to grow from the inside out.None can teach you.None can make you spiritual.There is no other teacher but your own soul.

10, డిసెంబర్ 2015, గురువారం

మానవ బంధాలు మర్చిపోవద్దు .

యాంత్రికజీవితంలో  మనం  మన  సున్నిత  బంధాలను  మర్చిపోతున్నామా  అనిపిస్తున్నది . ప్రతివాడికి  తన చుట్టూ  ఒక  వలయం !అందులో  తనవారు !ఇతరుల  గురించి  తనకవసరం  లేదు ! కానీ  తనకు  యేదయినా  ఆపద  కలిగితే  అందరూ  పలకరించాలి !అంటే  మనిషి  అంతరాంతరాలలో   యెక్కడో  ఒక  సున్నితపొర  వుంది .
అది  తొలగాలి . చెన్నై ప్రళయం  మానవ విలువలను  తట్టి  లేపింది . అందరూ  ఒకరికి  ఒకరుగా  పలకరించుకున్నారు . కులమతాలకు  అతీతము  ఆప్యాయతలు  వెల్లివిరిసాయి . మనం  కనీసమ్  వారానికి  ఒక్క  సారయినా  హాయిగా  మనసు  విప్పి  కబుర్లు  చెప్పుకుంటే  యెంత  బాగుంటుంది ,అన్న  భావం  అందరిలో  కలిగింది ఈ  t.v ,మొబైల్ ,ఐపాడ్  కట్టి పెట్టి  కనీసం  వారం లో  ఒకరోజు రెండు  గంటలు అమ్మ ,నాన్న ,బామ్మ  తాతయ్య  బాబాయి ,అత్తయ్య  మనవళ్ళు ,మనవరాళ్లు కలిసి  సరదాగా  కబుర్లు  చెప్పుకుంటూ  భోజనం  చేస్తే
యెంత  బాగుంటుందో !ఎంత  మధురమయిన  అలోచన !ఆలో చనే  ఇంత  అందంగా  వుంటే  ఆచరణ  యింకా  యెంత  మధురం !మనం  మన  పిల్లలకు  యివ్వ వలసినవి  కేవలం  ఆస్తులే  కాదు , మానవ  బంధాలను  కూడా
మధురంగా  తెలుపాలి . అప్పుడే  సమాజంలో  సానుకూలత  వెల్లి విరుస్తుంది . 

4, డిసెంబర్ 2015, శుక్రవారం

తల్లీ ప్రకృతీ మన్నించమ్మా

మనం  యెంతో  సాధించాం ,అంతరిక్షంలో  దూసుకెళ్తున్నాము ,ఆహా  ఓహో  అనుకుంటాం కానీ నిజమా 1యేమో  ?
ప్రకృతిని  జయించాం  అనుకుంటాం   కానీ  మన  భ్రమ !పంచ  భూతాలముందు  తల  వంచాల్సిందే !యింత  టెక్నాలజీ  మనకున్నది .వరదలను  ఆపగలిగామా ?చెన్నయిలో  ఆ  వాన  పోకడను చూస్తె  నాకైతే  యేదో  తీవ్రమైన  శాప ఫలితమా  అనిపిస్తున్నది . పవర్ కట్ .దోవలన్నీ  జలమయం ,నిత్యావసర  వస్తువులు  కోసం  వీధిలొనికి  వెళ్ళలేని  పరిస్తితి ,కోటీ శ్వరు డయినా  తడుముకోవాల్సిన  పరిస్తితి !పేరున్న  వైద్యాలయం  జనరేటర్లు
పని  చేయక  వెంటి లేటర్ల  మీద  వున్న  రోగులకు  ఆక్సిజన్  యివ్వలేక  వాళ్ళందరూ  మరణించారు . దయనీయమయిన  సంఘటన !ఎందరు  చిన్నారులు ,యెందరు  తల్లులు ,యెందరు  బాలింతలు  తల్లడిల్లుతున్నారో !భగవంతుడా  శాంతించు !మా  తప్పిదాలను  కరుణతో  మన్నించి  క్షమించు !


3, నవంబర్ 2015, మంగళవారం

ఈ జీవితం మనది

జీవితాన్ని  మలుచుకోవడం  కూడా  ఒక  సమర్ధత  అనిపిస్తుంది . ఒకరోజు  అలా  వాకిట్లో  వచ్చి  నిలబడ్డాను .  సుమారు  వుదయం  10 గంటలు  అవుతోంది .  అప్పటిదాకా  రణగొణ  ధ్వనులతో  హోరె త్తిన   వీధి  ఒక్కసారిగా
నిశ్శబ్దం !స్కూలు  బస్సులు ,కూరల బళ్ళు ,చెత్తవాడి  అరుపులు  మధ్య  మధ్య  ఇంట్లో  భార్యాభర్తల  హడావిడి ,
అన్నీ  ఒక్కసారిగా  ఆగిపోయాయి . కేవలం  రిటైర్ జనాలు ,గృహిణులు  మిగిలారు . ఈరొజుల్లొ  ఎవ్వరూ  అమ్మలక్కల  కబుర్లు  చెప్పుకోవడం  లేదు .  చక్కగా  సమయాన్ని  వాడుకుంటున్నారు . ప్రతివాళ్ళు  ఏదో  పనిలో  బిజీగా  వుంటున్నారు . వృద్ధాప్యం  శాపం  కాదు ,అలాగే  రిటైర్  జీవితం  బోర్  కాదు . ప్రస్తుతం  రిటైర్మెంట్  గురించి
మాట్లాడుకుందాం . ప్రభుత్వం లో  కొన్ని  సంవత్సరాలు  పని  చేసిన  తర్వాత  ఒక్కసారిగా   నువ్వు  అవసరం  లేదంటే  కొన్ని  రోజులు  బాధ  సహజం !కానీ  మనకంటూ  ఒక  పద్ధ తిని  అలవర్చుకోవాలి !ఇన్నేళ్ళు   మనం
మనకోసం  బ్రతకలేదు ,కేవలం  బ్రతుకుతెరువు  కోసం  కష్ట పడ్డాం . పిల్లల్ని  చదివించి  పెళ్లి  చేసి  వాళ్ళకు  దోవ
చూపించాం . కొంతకాలం  వాళ్ళకు  మంచీ  చెడు  చెప్తాం . కానీ  అదేపనిగా  వాళ్ళను  గురించి  ఆలోచిస్తూ  మన
సమయాన్ని  వృధా  చేసుకోవద్దు . ఈ  సంధ్యా  సమయం  మనది !ఇన్నాళ్లూ  మనకంటూ  వున్న  ఆలోచనలను
ఆచరణలో  పెట్టుకుందాం ,మనకు  నచ్చిన  కార్యక్రమాలను  సాటివారితో  పంచుకుందాం .  పాజిటివ్  గా  ఆలోచించడం  అలవర్చుకుందాం . మన  భావాలే  మన  జీవన  విధానం . మనచుట్టూ  ఎంతో  రమణీయ  అందాలు  వున్నాయి !నిజానికి  సమయాన్ని  పద్దతిగా  వాడుకుంటే  24గంటలూ  సరిపోవు . చక్కని   పెయింటింగ్స్  వేసుకోవచ్చు ,మంచి  మంచి  పుస్తకాలు  చదువుకోవచ్చు ,మనకు  ఎంతో  విలువైన  సాహిత్యం
వుంది ,ఆ  ఆణిముత్యాలను  చదువుకోవచ్చు ,మధురమైన  సంగీతమ్  వినవచ్చు  నలుగురికి  నాలుగు  మంచి
మాటలు  చెప్పవచ్చు  ఆశ్ర మాలకు  వెళ్లి  అక్కడ  అందరితో  హాయిగా  గడిపి  రావచ్చు  చక్కటి  కవితలు  వ్రాసుకోవచ్చు యిలా  ఎన్నో  ఎన్నో  ! జీవితం  మనది !మనం  చక్కగా  వాడుకుందాం ! అందమయిన  యీ
జన్మ  మళ్లీ  రాదు !నిరాశతో  కాకుండా  నింగినంటే  ఆశతో  జీవిద్దాం !

27, అక్టోబర్ 2015, మంగళవారం

కదలిక కావాలి (రావాలి)

భారత నారి  గౌరవానికి  మర్యాదకు  సకల  జాతులకే  తలమానికంగా  నిలిచింది , మన  సనాతన  ధర్మంలో  , మన  వేదాలలో  స్త్రీ  స్థానం  ఉన్నతం ఆనాటి  పురుషుడు! మహిళకు  సంకెళ్ళు  బిగించలేదు . ప్రతి  రంగంలో  సమాన
విలువ  యిచ్చాడు . మరి  యిప్పుడు  మనం  అన్నిరంగాలలో  మహిళలు పురోగమనంలో  వున్నారు . వున్నతంగా  జీవిస్తున్నారు .  కాని  మనం  జీవిస్తున్న  యీ  సమాజంలో  యెందుకు  యిన్ని  మానభంగాలు ?
అంతేకాదు  చంపడాలు, ముక్కలు ,ముక్కలు  గా  కోయదాలు !యేమిటి  యీ  వికృత  ధోరణి ? మానవుడు
దానవుడుగా  మారుతున్నాడు .  రావణాసురుడు  సీతను  బంధించాడు ,కానీ ,అంత  దానవుడు  కొంత  కట్టుబాటుకు  తల  వంచాడు .  యినాటి  యీ  నేర ధోరణి  ఆనాటి  రాక్షసులకన్నా  దారుణంగా  వున్నది .
రోజూ  దినపత్రికలో  వార్తలు  చదువుతున్నా ,t.v  లో  చూస్తున్నా మనసంతా  చెదిరి  పోతున్నది . మనదేశంలో
పాపాయి  భూమిమీదికి  వస్తూ  తనతో  పాటే   యీ  అత్యాచార విష సర్పాన్ని  మెళ్ళో  వేసుకుని  వస్తున్నదేమో !
నెలల  పిల్ల  దగ్గరినించి ,పండు  ముదుసలి  దాకా  ఆడ  అయితే  చాలు  కామం  తీర్చుకోవడానికి !మొన్ననే
పేపర్లో  చదివాను  ఒక  కామపిశాచి పూడ్చిన  స్త్రీ  శవాన్ని  బయటకు  తీసి   కోరిక  తీర్చుకున్నాదు .  వాణ్ని  చంపినా  పాపం  లేదు / చిఛీ /అసహ్యం  వేస్తోంది .ఆకాశం లో  సగం  అని  చెప్పుకోవడానికే  ఆడాళ్ళు  వున్నారు /
ఆచరణలో  శూన్యమ్ .
అసలెందుకిలా  జరుగుతున్నది ? ఎక్కడుంది  లోపం ? మనిషి  మెదడులో  యీ  కలుపు మొక్కలు  విష వలయాలుగా  అల్లుకు  పోతున్నాయి . వాటిని  వేళ్ళతో  తుంచెయ్యాలి . క్రూరమైన  ఆలోచనలు  యెందుకు
వస్తున్నాయి ?జాలి  దయ ,మానవత్వం  అనే  పదాలు  మాయమైపోయాయి !మనసమాజంలో  విలువలకు
వలువలు  వలస  వెళ్ళాయి . సంస్కారాన్ని  మన  పదకోశంలో  కప్పెసాం . సమయం  వచ్చేసింది ,ప్రతి  పాఠశాలలొ  తప్పని  సరిగా  విలువలను  బోధించాలి . పెద్దవారు  అనుభవజ్ఞులు , విద్యావంతులు ,మన  రామాయణం  ,
వేమన శతకం  భాగవతం    అందులోని  మానవతావిలువలు  వివరిస్తే  యిన్ని  అనర్ధాలు  జరగవు . ప్రతి  వ్యక్తి
ప్రతి  అమానుష  చర్యను  ఖండించాలి . మనలోని  అలసత్వాన్ని  తరిమెయ్యాలి ,జాతిని  కాపాడుకోవాలి .
మనకెందుకులే  ,మనింట్లో  కాదుగా  అనే  ధోరణి  మారాలి . సమాజం  మనదే  సమస్యలు  కూడా  మనవే !క్ట ఒక  మహిళను  చంపేసి  గొనెసంచీలొ  కుక్కేసి  గోడలో  పెట్టేసి  ప్లాస్ట రింగ్  చేసారంటే వాళ్ళు  అసలు  రాక్షసులే !
పక్కింటి వాళ్ళకు  యింతపని  జరుగుతున్నా  చప్పుడు  వినిపించలేదా ?తప్పకుండా  వినిపిస్తుంది  కానీ
మనకెందుకులే  అని  వూరు కున్నారు . ప్రతి వాళ్ళు  మనచుట్టుపక్కల  కదలికలు  గమనిస్తూ వుండాలి .  అనుమానం  వస్తే  అందరూ  కలిసి  నిలదియ్యాలి . నీతిమాలిన  చర్యలను  అరికట్టాలి .
   

18, అక్టోబర్ 2015, ఆదివారం

నా భావాలు: నారీ నీవే నవదుర్గవు!

నా భావాలు: నారీ నీవే నవదుర్గవు!: నవరాత్రులు  మొదలయ్యాయి . ఎటుచూసినా  అమ్మవారి  పూజలే . బాలగా  లలితగా  చండికగా  అన్నపూర్ణగా గాయత్రిగా  శైలపుత్రిగా  రాజరాజేశ్వరి గా  ఆ  తల్ల...

17, అక్టోబర్ 2015, శనివారం

నారీ నీవే నవదుర్గవు!

నవరాత్రులు  మొదలయ్యాయి . ఎటుచూసినా  అమ్మవారి  పూజలే . బాలగా  లలితగా  చండికగా  అన్నపూర్ణగా
గాయత్రిగా  శైలపుత్రిగా  రాజరాజేశ్వరి గా  ఆ  తల్లి  మనలను  కరుణ ,తీక్షణ ,వీక్షణలతొ మనల్ని  నిరంతరం  గమనిస్తున్నది .  స్త్రీమూర్తిలోని  వివిధ  కోణాల  అల్లికే  యీ  నవరాత్రుల  విశేషం . బాలగా  పుట్టింటి  ముత్యాలముగ్గు .  లలితగా  అత్తింటి  నట్టింటి నడయాడే  సజీవ  చైతన్య  రాశి . అన్నపూర్ణగా  అందరి కీ ఆకలి
తీర్చే  చల్లని తల్లి . సహనానికి  రాజరాజేశ్వరి !యిన్ని  కోణాలలో మరో విభిన్నకోణం  అన్యాయాన్ని  అధర్మాన్ని
అణగదొక్కే  అపర  చండిక . ఈ  దేశం మహిళను  గౌరవించి  మహోన్నత  పదవిలో  నిలిపింది . భారత  మహిళ
కనిపిస్తే  అన్యదేశ  ప్రజలు తలవంచి  నమస్కరిస్తారు .  మరి  మనసంస్కృతి  దిగజారి  గమ్యం  లేని  పయనానికి
బాటవేస్తున్నది .  మహిళలు   అన్నిరంగాలలో  దూసుకెళ్ళ్తున్నారు . రోజుకో  నిర్భయ  అకృత్యం .  ఎక్కడుంది
లోపం ?చౌక బారు  చలన చిత్రాలు  t.v  సీరియళ్ళు  ఆగాలి .  మగువను  లలితంగా  చూపించాలి . వెకిలి  మాటలను కట్టడి  చెయ్యాలి
. జగద్గురువు  శ్రీ  శంకరాచార్యులవారు   సౌన్దర్యలహరిలొ  అమ్మవారిని  యిలా  స్తుతించారు
మనస్త్వం  వ్యోమత్వం  మన రుదసి  మరుత్సారథి  రసి
త్వమాప  స్త్వం  భూమి  స్త్వయి  పరిణతాయాం  న  హి  పరమ్ 1
త్వమేవ  స్వాత్వానం  పరిణమైతుమ్  విస్వవపుషా
చిదానందాకారం  శివయువతి  భావేన  బిబృషే

తల్లీ  ఆజ్ఞాచక్ర మందున్న  మనస్తత్వం  నీవె  విశుద్ధ  చక్రమందున్న  ఆకాశ తత్త్వం  నివే  అనాహత  చక్రమందున్న
వాయుతత్వం  నీవే  స్వాదిష్టాన  మందున్న  అగ్ని  తత్త్వం  నీవే  మణిపూర  మందలి ఆప్తత్వం  నీవే  మూలాధార
చక్రం మందలి  భూతత్వం నీవె


శంకర  భగవత్పాదులు  తెలిపినట్టుగా  స్త్రీ  అన్నిభావాల  కలయిక !

12, అక్టోబర్ 2015, సోమవారం

ఆలోచనలు - ఆచరణలు

ద్సష్టిలో  ప్రతిజీవి  కి  మనసు ,హృదయం ,మెదడు  వున్నాయి .  ప్రతి  జీవి  తనదైన  భాషను  వాడుతుంది . అన్ని  జీవుల  భాషలు  అన్నిజీవులకు  అర్ధం  కావు . భావం  ఒకటే  అయినా  భావప్రకటన  భాష  వేరు . గోమాత  పలికే
"అంబా "లో  యెన్నో  భావాలు !సునిశితం గా  పరిశీలిస్తే  ఆ  అరుపులో  ఆవేశంలో  ఒకరకంగా ,ఆవేదనలో  ఒకరకంగా ,ఆప్యాయతలో  ఒకరకంగా  భావాలు  పలుకుతాయి . అలాగే  ప్రతిజీవి  తన  భాషలో  తనభావాలను తెలుపుతుంది . మనం  బుద్ధి జీవులం !బుద్దితో  అలోచించి  సంస్కారమైన  భాష  వుపయోగించి భావ  ప్రకటన
చేస్తాము .పశువు  ఆలోచిస్తుంది , మనం  ఆలోచిస్తాం . పశువు  ఆలోచనలు  సమాజాన్ని  ప్రభావితం  చెయ్యవు .
కానీ  మన  ఆలోచనలు   భాష  ఎదుటి  మనిషిని  ప్రభావితం  చేస్తాయి . అందువల్ల  పర్యవసానం  ఎలా
వుంటుందో!కాబట్టి  ఆలోచనా సరళి సక్రమంగా  వుండాలి . ఆలోచన  సక్రమం ,ఆచరణ  సక్రమం  అయితే  అందరు హాయిగా  వుంటారు . అలేగ్జాందర్  ఎంతో  తెలివిగలవాడు  కాని  ఆలోచన  ఆచరణ  సరిగా  లేవు .  చరిత్రలో  నిలిచినా  నరహంతకుడిగానే  నిలిచి  పోయాడు . గాంధీజీ  ఆలోచన  ఆచరణా  సక్రమం  అవటం  వల్ల  మహాత్ముడు  అయ్యారు ,జాతిపితగా  అందరి  మనసుల్లో  నిలిచిపోయారు .
 మన  ఆలోచనే  మనల్ని  విజయపథంలోకి  నడిపిస్తుంది . ఆలోచనాప్రవాహానికి  దిశా నిర్దేశం  కావాలి . ఒకసమస్య  దానికి సక్రమ  ఆలోచన ,ఆలోచనలోనించి  సక్రమ  పరిష్కారం ,నిర్మాణాత్మక  ఆచరణ  యివే  మనిషిని  మనీషి గా  నిలబెడుతాయి . భ్రమలో  జీవించ వద్దు ,భ్రమ  అనే  మత్తులో  తేలవద్దు ,సత్యంలో  జీవించి  సత్యాన్వేషణ  చేసినప్పుడే  ఆలోచనలు  సత్ఫాలిస్తాయి . లేనిది వూహించుకుని ,మెదడును  మనసును  కలుషితం  చేసుకోకూడదు . నిజం  లోనించి  నిజాయితీ  నిలబడాలి . 

11, అక్టోబర్ 2015, ఆదివారం

నా భావాలు: మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం ల...

నా భావాలు: మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం ల...: మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం లో మనం వు న్నా మా అని త లు కాచు కుంటే రో త పుడ్తు న్నది ,నే టి సమా జం లో వున్నది కే వలం మహ...

16, సెప్టెంబర్ 2015, బుధవారం

సాయినాథుడే సకలం

సాయి నాథుని  లీలలు  సకల  జనులకు  సంపదలు ,
అందరిలో  నిండిన  అనంతుడే  మన  సాయి నాథుడు ,
బాబా  కరుణా  కటాక్షాలే  కావాలి  మనకు  నిరంతరం ,
ఆ  చల్లని  చూపుల  కాంతులలో  కావాలి  అణువణువు
పవిత్రం ,బాబా  నడయాడిన  షిరిడిలో   పుణ్యమెంత
చేసెనో కద  ఆ  పవిత్ర ధూళి !

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సేమ్యాతొ స్నాక్స్

దోశె -సేమ్యా 2కప్పులు ,బొంబాయి  రవ్వ 1కప్పు ,బియ్యప్పిండి 1కప్పు ,పుల్లమజ్జిగ 1కప్పు జీలకర్ర 1స్పూన్ ,ఉప్పు  తగినంత ,నూనె -ఒకగిన్నెలో ఇవన్నీ  కలిపి 1గంట  నానబెట్టి  దోశెలు  వేసుకోవాలి
సేమ్యాలడ్డు -సేమ్యా  చిన్న  చిన్న  ముక్కలు  చేసుకోవాలి ,కోవా 150గ్రాములు ,పంచదార 1/2కప్పు ,నెయ్యి 4స్పూన్లు ,యాలకులపొడి 1/2స్పూన్ ,dryfruits 50గ్రాములు -ఒక  గిన్నెలో పంచదార,dryfruits ,యాలకులపొడి
కోవా  తీసుకుని  బాగా  కలపాలి బాణలిలో  నెయ్యి వేడి  చేసి  సేమ్యాముక్కలను  ఎర్రగా  వేయించాలి . ఇందాక  కలిపిన  ముద్దను సేమ్యాముక్కలలో  కలపాలి 3నిమిషాలు  సెగ  మీద  వుంచి  తీసేయ్యాలి . వేడి  కొద్దిగా  తగ్గాక .
 వుండలు  కట్టాలి
సెమ్యవద -ఉడికించిన  ఒక  కప్పు  సేమ్యాలో 1/2కప్పు  మైదా ,1/2కప్పు  బొంబాయి  రవ్వ ,ఉల్లిపాయ  తరుగు 1కప్పు 2పచ్చిమిర్చి ,చిన్న అల్లం  ముక్క ,కొద్దిగా  జీలకర్ర ,కొన్ని  పల్లీలు ,వుప్పు  తగినంత  కలపాలి .తర్వాత
వడలాగా  ఒత్తుకుని  నూనెలొ  వేయించుకోవాలి
బియ్యం  చెక్కలు -బియ్యం 3కప్పులు ,పెసరపప్పు 1కప్పు ,సగ్గుబియ్యం 1/2కప్పు నువ్వులు 2స్పూన్లు ,జీలకర్ర 1స్పూన్ ,వెన్న 1స్పూన్ ,కారం ,వుప్పు  తగినంత -బియ్యం ,పెసరపప్పు ,సగ్గ్గుబియ్యం  విడివిడిగా  2గంటలు
నానబెట్టుకోవాలి .  మెత్తగా  పిండి  చేసుకోవాలి . అందులో  నువ్వులు ,జీలకర్ర ,వెన్న ,వుప్పు  కారం  వేసి  చపాతీ
ముద్దలా  కలపాలి . కొద్దిసేపు  తర్వాత  చిన్న  చెక్కల్లా  ఒత్తుకుని  నూనెలో  వేయించు కోవాలి . .     

10, సెప్టెంబర్ 2015, గురువారం

రకరకాల రుచులు

దహీపూరి -2 బంగాళా దుంపలు ,శెనగలు 1/2కప్పు ,పెసలు 1/2కప్పు ,ఆకుపచ్చ బఠాని 1/2కప్పు ,అల్లంవెల్లుల్లి  ముద్ద 1/4స్పూన్ ,జీలకర్రపొడి 1/2స్పూన్ ,కారం 1/2స్పూన్ ,ఉప్పు  తగినంత కావాలి .
శెనగలు ,పెసలు ,బఠాని  కలిపి  గంటసేపు  నానపెట్టాలి .  తర్వాత  కుక్కర్లో  పెట్టి  మెత్తగా  వుడికించాలి .   దీనికి
అల్లంవెల్లుల్లి  ముద్దను ,కారం ,జీలకర్రపొడి ,వుప్పు  కలపాలి . అప్పుడు  మనం  చేసిన  పూరి  తీసుకుని  మధ్యలో
చిన్నగా  గుంటలాగా  నొక్కాలి . అందులో  ఈ  కలిపిన  ముద్దను  పెట్టాలి . దినిమీద  దహి  చట్నీ  పోసుకోవాలి ,చిటి కెడు  చాట్  మసాలా  చల్లుకోవాలి . దహిపురీ  తయ్యార్ .
దహీచట్ని -పెరుగు 1కప్పు ,కొబ్బరిపొడి 2స్పూన్లు ,పంచదార  2స్పూన్లు ,పండుమిర్చిముద్ద 1స్పూన్ ,నల్లవుప్పు
చిటి కెడు  వుప్పు  తగినంత . పెరుగులో  యివన్నీ  కలుపుకోవాలి . దాహిచట్ని  తయ్యార్ .
పానీపురి -తగినన్ని  పూరీలు ,ఆకుపచ్చ  బఠాని 1కప్పు ,బంగాళా దుంప 1,చింతపండు  గుజ్జు 1స్పూన్ ,కారం 1స్పూన్ ,చాట్ మసాలా 1/2స్పూన్ ,కొత్తిమీర 1కట్ట ,వుప్పు  తగినంత . బఠానీ ,ఆలు  మెత్తగా  వుడికించాలి .
ఈ  ముద్దకు  వుప్పు ,చాట్ మసాలా ,కొత్తిమీర కలిపి  వుంచుకోవాలి . ఒక  గ్లాసు  నీళ్ళు  తీసుకుని చింతపండు
గుజ్జు ,కారం ,వుప్పు  కలుపుకోవాలి . ఇప్పుడు  పూరీని  మధ్యలో  గుంట  నొక్కుకుని  అందులో  ఆలూ బఠానీ  మద్దను పెట్టి  రెడీగా  వున్న చితపండు  నీళ్ళల్లో  ముంచి  తినాలి .
సగ్గుబియ్యం వడ -సగ్గుబియ్యం 1కప్పు ,వుడికించి తొక్కు తీసిన  బంగాళా దుంప 1,వేయించిన కచ్చాపచ్చాగా
దంచిన  పల్లీన్లో /2కప్పు ,చీల్చిన  పఛిమిర్చి 2,జీలకర్ర 1స్పూన్ ,కొత్తిమీరతురుము 2స్పూన్లు వుప్పు  తగినంత
నూనె  వేయించడానికి  తగినంత . సగ్గుబియ్యం 3సార్లు  కడగాలి . నీళ్ళుపోసి  6గంటలు  నానపెట్టాలి . బాగా
నానిన  ముద్దకు  మిగిలినవి  అన్నీ  కలిపి  మెత్తగా  ముద్ద  చెయ్యాలి చిన్న  చిన్న  గారెలుగా  చేసి నూనెలోaవేయించుకోవాలి .సగ్గుబియ్యమ్  వడలు  తయ్యార్
సెనగపిండి  బర్ఫీ -సెనగపిండి 1కప్పు ,నెయ్యి 1కప్పు ,పాలపొడి 1కప్పు ,పంచదార ఒకటిన్నర కప్పు ,నీళ్ళు
2కప్పులు -బాణలిలో  నెయ్యి  కరిగించి  పచ్చి  వాసన  పోయేదాకా  సెనగపిండి  వేయించుకోవాలి . గిన్నెలో
తీసుకుని  పాలపొడి  వేసి  బాగా  కలపాలి ఒకగిన్నెలో  నీళ్ళు  పంచదార  తీసుకుని  సన్నని  మంట తో  వుండ  పాకం  రానివ్వాలి దాన్లో  సెనగపిండి  మిశ్రమం  కలపాలి  దగ్గరగా  వచ్చేదాకా  సన్న  సెగ  మీద  వుంచి  దించెయ్యాలి వేడి  చల్లారాకా  బిళ్లలుగా  కోసుకోవాలి

9, సెప్టెంబర్ 2015, బుధవారం

కావలసిన పొషకాలు

మన  శరీరానికి  అన్ని  పోషకాలు  కావాలి  ఏది  తగ్గినా  సమస్యే /
vitaminA -పాలు ,కారట్ ,క్యాబేజీ ,ఆకుకూరలు ,వెన్న ,మీగడ ,టమాటో , వాడాలి . చర్మవ్యాధులు  రావు .  కంటిచూపు  కాపాడుతుంది .
vitaminB - ఇది  8విటమిన్ల  కలయిక . ధాన్యం ,ఆకుకూరలు ,యీస్ట్ ,. నాడి  వ్యవస్థ  బలపడుతుంది .
vitaminC -టమాటో ,కాబేజీ ,ఎండుమిరప ,కాలిఫ్లవర్ ,స్టాబెరి . శరీరంలోని  టిష్యు లను  బలంగా  ఉంచుతుంది .
మానసిక  రుగ్మతనుండి  కాపాడుతుంది .  దంతాలు  గట్టి  పడతాయి అలసట  దూరం  చేస్తుంది .
vitaminD -సూర్యరశ్మిలో  బాగా  వుంటుంది .  రోజు కాసేపు  ఎండలో  కూర్చోవాలి . ఎముకలు  గట్టి  పడ్తాయి
vitaminE -కారట్ ,క్యాబేజీ ,ఆలివ్ ఆయిల్  చపాతీ ,ఆకుకూరలు ,జీడిపప్పు . రక్తప్రసరణ  బాగా  జరుగుతుంది .
vitaminK -ఆకుకూరలు . రక్తం  గడ్డ  కట్టకుండా  ఆపుతుంది
vitaminC -సిట్రస్  పళ్ళల్లో  అధికం . రక్తకణాలు  పెరుగుతాయి . ఉసిరి ,టమాటో ,బ్రకోలి ,నిమ్మ  బత్తాయి .
బాదం ,వాల్ నట్స్ ,కాల్షియం  ఇస్తాయి .
పాలు ,తృణధాన్యాలు ,సోయా ,లో  కాల్షియం  వుంటుంది . .విటమిన్ 12 లోపంతో  రక్తహినత  ఏర్పడుతుంది .
బరువు  తగ్గుతారు  పాలు  బాగా  తాగాలి . B 12మాత్రలు  వాడాలి .
B 9-ఫోలిక్ యాసిడ్ -ఇది  గుండె  రక్షణకు  అవసరం ఆకుకూరలు ,పుల్లటి పళ్ళు ,గింజపప్పులొ  కలదు

  

ఆరోగ్యాని కి జాగ్రత్తలు

పుట్టుక  మనచేతిలో  లేదు .  కానీ  ఆ  జీవితాన్ని  మలుచు  కోవడం  మన  చేతిలో  వుంది .  మానసికంగా    ఆరోగ్యంగా  ఉండాలి .అలాగే  మన  శరీరం  కూడా  ఆరోగ్యంగా  వుండాలి . నాకు  తెలిసిన  కొన్ని   విషయాలు
వ్రాస్తున్నాను .
మెంతులు  ఆకలిని  కలిగిస్తాయి . ఒక్కోసారి  మనకు  తినాలనే  ధ్యాసే  వుండదు . అప్పుడు మెంతి  పొడిని మొదటి  ముద్దలో  తింటే  ఆకలి  పుట్టి  యితర  అధరువులను  కలుపుకోవాలనిపిస్తుంది .
మెంతులు   శరీరంలో  అన్ని  భాగాలకు  శక్తి  యిస్తాయి .
మెంతి  ఆకు  మెత్తగా  నూరి   కొద్దిగా  నెయ్యి  కలిపివుడికించి  ఎంత  పెద్ద  గడ్డ  పైన  వేసి  కట్టినా   గడ్డ  పగులు  తుంది .
మెంతియాకు  మెత్తగా  నూరి  పెరుగుతో  కలిపి  తలకు  పట్టించుకుని  ఆరిన  తర్వాత  తల  స్నానం  చేస్తే  జుట్టు  పెరుగుతుంది .
రోజూ   వుదయాన్నె   పళ్ళు  తోముకున్న  తర్వాత  లేత  వేపచిగురు  తింటే  పొట్టలో  పురుగులు  నశిస్తాయి .
కొవ్వు  కరగాలంటే  పొద్దున్నే  ఒకగ్లాసు  నిమ్మరసం  గోరువెచ్చని  నీళ్ళల్లో  కలుపుకుని  తాగాలి .
అల్లం  ముక్కలు  నీళ్ళల్లో  బాగా  మరిగించి   వడ  కట్టి  కొద్దిగా  తేనె  కలుపుకొని  తాగితే  జీర్ణ వ్యవస్థ  బాగుంటుంది .
ఉదయాన్నే  వెల్లుల్లి  రెబ్బలు  కొన్ని   నిమ్మరసంతో  కలిపి  తీసుకుంటే  రక్తప్రసరణ  బాగుంటుంది .
రాత్రి  2 లేక  3బాదం  పప్పులు  నానబెట్టి  పొద్దున్నే  పొట్టు  తీసి  తింటే  పొట్ట  చుట్టూ  పేరుకున్న కొవ్వు  తగ్గుతుంది .
కలబంద   రసంలో  ధనియా  పొడి  వేసుకుని  తాగితే  పొట్ట  చుట్టూ  వున్న కొవ్వు  తగ్గుతుంది .
ప్రతిరోజూ  ఒక  అరటిచేస్తూ పండు  తింటే  రక్తపోటును  నివారించవచ్చును .
ఆహారంలో  పాలకూర  వాడడం  వల్ల  కూడా  రక్తపోటు  control  చెయ్యచ్చు
నారింజరసం   high  B  P  CONTROL  చేస్తుంది .
జుట్టు  రాలకుండా  వుండాలంటే  ఆలివ్  నూనెలో  రెండు  చుక్కల  నిమ్మరసం  వేసి  తలకు  బాగా  మర్దన  చెయ్యాలి
. \ బాగా  యింకిన  తర్వాత కుంకుడు  రసంతో  తల  కడుక్కోవాలి .
కరివేపాకును  బాగా  మెత్తటి ముద్ద  చేసి  కొద్ద్దిగా  కలబంద  గుజ్జు  కలిపి జుట్టుకు  రాసుకుని  ఆరిన  తర్వాత
తలరుద్దుకోవాలి .  జుట్టు  నల్లగా  వస్తుంది .
కరివేపాకు  ముద్దలో  కొద్దిగా  ఆలివ్  నూనె  కలిపి  తలకు  రాసుకుని  గంట  తర్వాత  స్నానం  చెయ్యాలి . ఇలా
వారంలో  రెండుసార్లు  చేస్తూ  వుంటే  చుండ్రు  పోతుంది
కొబ్బరినూనెలొ   కొన్ని  కరివేపాకులు  వేసి  బాగా  వేడి  చేసి  వడ  కట్టాలి .  ఈ  నూనె  రోజూ  రాసుకుంటే జుట్టు
వూదదు
దగ్గు  తగ్గాలంటే  మిరియాల  చూర్ణం నెయ్యి  చక్కెర కలిపి  ఒక  టీ  స్పూన  కొన్ని  రోజులు  తీసుకుంటే  దగ్గు
తగ్గుతుంది
  .


5, సెప్టెంబర్ 2015, శనివారం

character building

A man may die,but his character remains. His thoughts remains. It is the  character that gives real force and power to man. Character is power. They say,[Knowledge is power,] but in my view[Character is power.] Without character the  attainment of knowledge is impossible. If we want
success in life ,if we want to influence others, if we want progress well in the  spiritual  path and if we  wish to have God realisation we must possess spotless  character.The noble people like Sankara,
Buddha, and great saints influenced us with theireverlasting character. The character is  the  outcome
of our thoughts.,ideas.If we change our thoughts character also changes.Building up of character is building up of habits.  The change of character is the change of habits. Habit is second nature.Character is first nature. Character  will help us to attain the goal of life.

25, ఆగస్టు 2015, మంగళవారం

యువతా మేలుకో.....

మన  మహిళాలోకం  సాంఘిక  సమస్యలమీద స్పందించాలి . మత్తుపానీయాలమీద  నేటి  యువతకు  అవగాహన
వున్నదో  లేదో  అర్ధం  కావడం  లేదు . గుట్కా ,వైన్ ,విస్కీ  గుడుంబా , యివా  మనం  నేర్చుకోవాల్సిన  అలవాట్లు?
యువతలో  అపారమైన  విజ్ఞానం  వుంది  కానీ వాళ్ళు వాడే  అవకాశమే  లేకుండా  మార్కెట్లో  ఎన్నో  ఎన్నో
మాదకద్రవ్యాలను  ప్రవేశపెట్టి  వాళ్ళ  శక్తిని  చంపేస్తున్నారు .  యువకుల్లారా  యువతుల్లారా  మీలోని  అపారశక్తిని
 దేశంకోసం  సమాజంకోసం  మీభవితకై  వినియోగించండి . 

సేకరణ

గౌరవనీయులు ,పూజ్యులు ,మహానుభావులు ,శ్రీ ,ఎక్కిరాల  కృష్ణమాచార్య  గారు  రచించిన  శ్రీమద్భాగవత  ప్రకాశము  పంచమ  స్కందం  ద్వితీయ  భాగం  13 నందు అమూల్యమైన  కొన్ని   వివరాలను  అందరము వారు  తెలుసుకోవాలనే  తపనతో తెలియపరుస్తున్నాను , ఆచార్యులవారి  పాదాలకు  ప్రణమిల్లుతూ   వ్రాస్తున్నాను వారు  వ్రాసిన  వాక్యాలను  యథాతథంగా  వ్రాస్తున్నాను .
సూర్యుని  సంవత్సర  గమనము  నందు  ఉత్తరాయనము  దక్షిణాయనము  విఘవము  అను  గమనములు  వున్నవి వుత్తరాయనమున  పగలు  దీర్ఘముగా  రాత్రి . చిన్నగా  వుండును .  దక్షిణాయనము  రాత్రి  దీర్ఘముగా
పగలు  చిన్నగా  వుండును .  విఘవములందు  పగలు  రాత్రి  సమానముగా  వుండును .  ఏ  దినమునందు  మిక్కిలి  దీర్ఘమైన  రాత్రి  మిక్కిలి  చిన్నదైన  పగలు  వచ్చునో   ఆ  మరుసటి  దినమునుంది  ఉత్తరాయనము  ప్రారంభమగును .  పగలు  పెరిగి  రాత్రి  తగ్గుచుండును .  మూడు  మాసములలో  రాత్రి  పగలు  సమానముగా  వున్న  దినము  వచ్చును .  ఆ  నాటి  సూర్యోదయమును  విఘవము  అందురు .  అదియే  విఘవత్పుణ్య
కాలమందురు . ఆ  నాడు  సూర్యుడు  భూమధ్యరేఖను  దక్షిణము  నుండి  ఉత్తరము  నకు  దాటును .  అదియే
మేషరాశి  ప్రారంభము .ఆ  దినమునుంది  పగళ్ళు  పెరిగి  రాత్రుళ్ళు  చిన్నవగుచుండును .  మరల  మూడు
మాసములలో  అతి  దీర్ఘమైన  పగలు  అతి  చిన్నదైన  రాత్రి  గల  దినము  వచ్చును .   ఆ  మరునాటి  సూర్యోదయమునుంది  దక్షిణాయనం  ప్రారంభమగును  .దీనినే  కర్కాటక  రాశి  ప్రారంభం  అని  చెప్పవచ్చును.
ఆ  రోజునుండి  రాత్రులు  పెరుగుతూ  పగళ్ళు  చిన్నవిగా  అవుతూ  వుంటాయి .  మూడు  మాసముల  పిదప  రాత్రి  పగలు  సమానమైన  దినం  వస్తుంది .  దీనిని  దక్షిణ  విఘవం  అందురు .  ఆ  రోజు  నుండి  సూర్యుడు
తులా రాశి  లో  ప్రవేశిస్తాడు . ఆ  దినం  నుండి  పగలు  చిన్నగా  రాత్రి పెద్దదిగా  అవుతుంది . మరల  మూడు
మాసములలో   అతి  దీర్ఘమైన   రాత్రి  అతి  చిన్న  పగలు  గల  దినం  యేర్పడుతుంది . ఆ  మరుసటి  రోజు నుండి
ఉత్తరాయనం  ప్రారంభం  అవుతుంది .  దీనినే  మకర  రాశి  ప్రారంభం  అందురు . ఈ  లెక్కలన్నీ  లంకా  పట్టణ  ప్రదేశమున నిలబడి  గుణించి నప్పుడే  సరిగా  వచ్చును . లంక  అనగా  భూమధ్యరేఖ .  ఈ  విధంగా సంవత్సరమున  మూడేసి  నెలల  కొకటి  చొప్పున  నాలుగు  పాదములు  వచ్చును .ఇప్పటి  ఆంగ్ల  పంచాగం ప్రకారం  1)డిసెంబరు  22వ  తెదీనాదు  మకర  సంక్రమణం  లేదా  ఉత్తరాయన  పుణ్యకాలము  అంటారు .
2)మార్చి  21టవ  తెదీని  వుత్తర  విఘవం  లేదా  మేష సంక్రమణం   అందురు . 3)జూన్  22వ తెదీనాదు  దక్షిణాయనం  ప్రారంభం  లేదా కర్కాటక  సంక్రమణం  . 4)సెప్టెంబరు  21వ  తెదీనాదు  దక్షిణ  విఘవం  లేదా
  తులా సంక్రమణం ఈ  దక్షిణ  విఘవం  నాడు సూర్యుడు  వుత్తరం  నుండి  దక్షిణమునకు  భూమధ్యరేఖను
మారుచుండును దాటును . .ఈ  గమనములను  బట్టి  సూర్యుని  నుండి  భూమి  స్వీకరించు  సూర్యరశ్మి  యొక్క  కోణములు మారుచుండును .వానిని  బట్టి  శీతోష్ణ స్థితులు  ,వాయుగమనం  మారుతాయి . వానిని  బట్టి  వెసవి
కాలం ,వర్షాకాలం ,శీతాకాలము  మొదలవుతాయి .









 





















.





























18, ఆగస్టు 2015, మంగళవారం

science and sentiments

sentiments are part of  our daily life.Though we know they are our mental feelings,still we believe them.Some times these sentiments hurt the feelings of other persons. So sentiments are our personal and we should not hurt others. We all have faith in God.God is the creater of all living beings in this world.He is responsible for our every action and reaction. Then where is the place for sentiments?
As Lord Krishna told in Geeta  do karma don't wait for results,every body must do the duty and act positively for that situation. Sentiment must be sensitive,one should use hismind with analytical thinking.

Science is life.Morning to night eyery act in our life is linked with science.Only the defect is we are
not accepting science,so one should try to analyse every action with scientific outlook.But there are some exceptions GOD  HE IS ETERNAL.HE is a great scientist.He is Super Power.Dear readers
knowledge is power .Our Indian philosophy and science are sides of the same coin,they are one and only one. One should think properly,if vision is proper outlook is proper this whole society is happy.

12, ఆగస్టు 2015, బుధవారం

simple man with noble thoughts

మన  పంచమ  వేదం  మహాభారతం  భారతీయుల  జీవనాడి . భీష్మపితామహుని విష్ణుసహస్రనామం  మన  నిత్యపారయణమ్ . ఈనాటి  వర్తమాన  మహాభారతంలో  శ్రి  గౌరవరతుల్యులు  A  P  J  అబ్దుల్  కలాం  గారి సూక్తులు  ప్రతి  భారతియుడు  నిత్యం  మననం  చెయ్యాలి . 27 /7/2015    ఆయన   ఆత్మ  మరో  లొకానికి  పయనమైంది . కాని  మేము ఏం  కావాలి?అశ్రు  నయనాలతో  నా  తర్పణ స్వీకరించు మహాత్మా . ఆ  అమరజీవి  అమూల్య  సూక్తులు కొన్ని వ్రాసుకున్నాను .
'కష్టాలు  నిన్ను  నాశనం  చేయడానికి  కాదు ,నీలొని  సమర్ధతను  వెలికి  తీసి నిన్ను  నువ్వు న
     ని రూపించుకోవడానికీ  వస్తాయి .కష్టాలు  కూడా  బిత్తర  పోవాలి  నిన్ను  కష్టపెట్టడం  చాలా  కష్టమని। '
2. జీవితం  ,సమయం -ఈ  రెండు  ప్రపంచానికి  అత్యుత్తమ  ఉపాధ్యాయులు .

3. మనస్పూర్తి గా  పనిచేయని వారు  జీవితం  లో విజయం సాధించలేరు .
4. అపజయం  తప్పటడుగు  కాదు  నిన్ను  నిన్నుగా  సరిదిద్దుకోవదానికి  వచ్చిన  చక్కని  అవకాశం .
5. కలలు  కనండి  ఆలోచనలకు  రెక్కలు  తొడగండి  ఆలోచనలే  ఆచరణకు  పునాది  అవుతుంది .
6. అలవాట్లు  సక్రమం  అయితే  భవిష్యత్తు  సక్రమం  అవుతుంది .
7.  నీకు  గుర్తింపు  రావాలంటే  నీ  సమర్ధత  పెంచుకో . 

9, ఆగస్టు 2015, ఆదివారం

మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం లో మనం వు న్నా మా అని త లు కాచు కుంటే రో త పుడ్తు న్నది ,నే టి సమా జం లో వున్నది కే వలం మహోన్నతులు  దా న వత్వమే ,త రం మారితే మార్పు సహజం కాని యీ  తి రో గ మ మా ర్పు వూ హిం చ ని ది  ,నే టి యు వ తరానికి దిశానిర్దేసం కావాలి మ న  భా ర తీ య స మా జం లోవిశాలభావ పరంపర ప్రపంచానికే తలమానికం  మరి యీ  మానసిక  వైకల్యం  ఎక్కడిది? నాకు  మాత్రం కొన్ని  పరిష్కారాలు  కన్పిస్తున్నై .ప్రతి  యింట్లో పెద్దవారు ఆధ్యాత్మిక  వాతావరణాన్ని  పరిమళింప  చెయ్యాలి డ పిల్లలకు మంచి  చెడు విషయ  విచక్షణ విడమర్చి వివరించాలి ఇంట్లో వ్యక్తిగత విమర్శలుఅనవరస  ప్రసంగాలు వుం డ కూ డ దు సా ను కూ ల ఆలొ చనలు నిర్మాణాత్మక చర్చలు జరగాలి. దయ ,ధ ర్మం ,దానగుణంఇవన్నీ ఒకనాడు  మన  వ్య వస్త లో  అంతర్భాగంగా  ఉండేవి ఽఆ  తరంలో మహోన్నతులు  జన్మిం చారు  ధ న్య  జీ వుల  చరిత్రలన్నీ మనం  పరిశీలిస్తే  వారి  కుటుంబ ,సామాజిక  పరిస్తుతులు  యెంతో  వున్నత భావాలతో  విలసిల్లుతూ  వుండేవి . ఒక  బాలగంగాధర  తిలక్ ,ఒక  నేతాజీ  ,ఒక  టంగుటూరి ,యెందరో  యెందరో !మరి  నేడు  యెందు కీ  పతనం?కారణం పెద్దలు  సమాజం ,కాబట్టి పరిష్కారం  కూదా  వారి  దగ్గరే  వుంది .అలాగే విద్యాలయాలు ,గురువులు ,యువతకు  వున్నతమైన  శిక్షణ  యివ్వాలి . వారి  విద్యా  జీవనం  ముగిసిన  పిదప  బాహ్య  ప్రపంచంలో  వారు  తమకు  తాముగా  వున్నత  స్థానంలో  వుంటూ  యెదుటి  వారికి  చుక్కానిగా  జీవించాలి