నా భావాలు

26, జులై 2016, మంగళవారం

గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో తనువెల్ల  వడలిపోయెనమ్మ !                                                                              
ఉషోదయపు  తుషారపు వర్షపు  చినుకులతో  పుడమి  తల్లి  పులకరించెనమ్మ !                                                                                           పరవశించిన చిన్నారి   లేలేత  కొమ్మలు  విరుల పాన్పులు పరచెనమ్మ!                                                                                                    
ప్రకృతి  కాంత తనువెల్ల  మధుర  మల్లెల  పరిమళాల  తో  తడిసేనమ్మ!                                                                                            
కలువపూవుల  దరహాస  వదనం , గులాబీల  వయ్యారి  సొగసు  నను  జూసి నవ్వ  ,మది వూగె  నెత్తావి  వూయలగా మిత్రమా !
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 1:01 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో తనువెల్ల  వడలిపోయెనమ్మ !                                                                            
ఉషోదయపు  తుషారపు వర్షపు  చినుకులతో  పుడమి  తల్లి  పులకరించెనమ్మ !                                                                                           పరవశించిన చిన్నారి   లేలేత  కొమ్మలు  విరుల పాన్పులు పరచెనమ్మ!                                                                                                  
ప్రకృతి  కాంత తనువెల్ల  మధుర  మల్లెల  పరిమళాల  తో  తడిసేనమ్మ!                                                                                            
కలువపూవుల  దరహాస  వదనం , గులాబీల  వయ్యారి  సొగసు  నను  జూసి నవ్వ  ,మది వూగె  నెత్తావి  వూయలగా మిత్రమా !
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 1:00 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

22, జులై 2016, శుక్రవారం

భారతీయుల  దాస్య  సంకెలలను  తెంప అవతరించిన  మహనీయులు !                                                                                            
భరత మాత కన్నీరు  తుడిచిన నిస్స్వార్ధ  దేశ  భక్తుడు !                                                                                                              
బానిస  బతుకుల  విముక్తికై  పోరాటమే  మార్గమన్న  విప్లవ  మూర్తి!                                                                                              
"స్వరాజ్యమే  నా జన్మ  హక్కు "భారత జాతీయోద్యమ  పిత!                                                                                                       లోకమాన్య  శ్రీ బాల గంగాధర  తిలక్ !భారతీయ  ఆణిముత్యం  నేస్తమా !                                                                                                                    

1856 జులై  23 తిలక్  జయంతి !                                                                                                                                        
గణపతి  ఉత్సవాల ద్వారా  ఉద్యమ  స్ఫూర్తి  నింపారు !నేడూ ఉత్సవాలు  వున్నాయి కానీ  ఆ స్ఫూర్తి  ఉన్నదా ??
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 9:19 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
తెలుగు  తేజం  జాతీయ  తేజమై  ప్రభవించిన  రోజు !                                                                                                                
తెలుగు  ప్రతిభ  జాతీయ పతాకమై విలసిల్లిన రోజు  !                                                                                                                  
భారతీయ మువ్వన్నెల  జాతీయ  కేతనం  అంబరాన  రెప రెపలాడినంతకాలం !                                                                                  
మన  స్మృతి పథాన చెరగని  ముద్ర  మాన్యులు  శ్రీ  పింగళి  వెంకయ్యగాను  మిత్రమా !                                                                            

1947/జులై 22 భారత  జాతీయ కేతనం  ఆవిష్కరణ!
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 8:22 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

21, జులై 2016, గురువారం

10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పినట్టుగా  చదువుకుంటారు . వాళ్ళకంటూ  ఆలోచన  అవకాశం  రాకుండా  టీచర్  ఊపిరి          
సలపనంత వర్క్  యిచ్చి  పూర్తిగా  ఆధారపడేవిధం  గా తయారు  చేస్తున్నారు .ఖర్మ  కాలి యే పిల్లవాడైనా సందేహాలడిగితే  కొందరు  టీచర్లు      
 కసిరి  కూర్చోబెడతారు .కొందరు  టీచర్లు   మాత్రం  ఓపికతో  వారి  సందేహాలు  తీర్చడానికి  ప్రయత్నిస్తారు . అసలు  అంకం  యిక్కడే మొదలు !
 సందేహాలకు  కొద్దిగా  సమాధానాలు  దొరికిన  పిల్లవాడికి  చదువులో  ఆసక్తి  కలిగి  స్వయం  సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు
అలంటి  విద్యార్థులు  జీవితం లో  పైకి  వస్తారు .కానీ  వారికీ  ఇంట్లో  కూడా  ప్రోత్సహం  వుండాలి.తల్లి  తండ్రులకి  విద్యార్ధులకి  అభివృద్ధిలోకి
 రావాలనే  తీవ్ర  సంకల్పం  వుండాలే కానీ  డబ్బు ,వసతి  సమస్యే  కాదు !వీరి శాతం  తక్కువ ! చదువు  మీద  ఆసక్తి  ఉంన్నా అడుగడుగునా
నిరుత్సహపరచే   పరిస్థితులు  యెదురైతే  జీవితం  కొంత  గందరగోళం  అవుతుంది .అలంటి  పరిస్థితులలో  కూడా  స్వయం  కృషి తో  పైకి        
వచ్చిన  వాళ్ళు  వున్నారు . ఇకపోతే  కొందరు  తల్లితండ్రులు  కేవలం  డబ్బు  వున్నదని  అహంకారం  తో అడుగడుగునా  ప్రతి  విషయాన్ని    
 డబ్బుతో  పోలుస్తారు !చదువును  కూడా  కొనాలనే  చూస్తారు .పిల్లవాడికి  చిన్నప్పటినించి  ధనమదం ఒకవిధం గా  పెద్దవాళ్ళే  నేర్పుతారు .
చదువు కో అక్కర్లేదు  చదువు  కొంటె  చాలు  అనే  అవగాహనతో  పెరుగుతారు . తల్లితండ్రుల  సపోర్ట్  కూడా  తోడవుతుంది .
 ఇంటర్మీడియట్  లో  యీ మూడు  రకాల  వాళ్ళు  వారికీ  తగ్గ  విధం  గా  చదువుకుని   రెండేళ్లు  పూర్తీ చేస్తారు .ఎంసెట్  యీ  రోజుల్లో
ఒక  ప్రహసనం  అయ్యింది .ప్రతివారు  వ్రాస్తున్నారు ! రిజర్వేషన్  పుణ్యమా  అని  రాంక్  యెంత  అయినా  పర్వాలేదు  సీట్  ఖాయం .
 ఇందులో పేపర్  లీకులు !పేపర్  కొనుక్కోవడాలు !అసలు  మన విద్యా వ్వ్యవస్థ  పురోగమనమా తిరోగమనమా ? అవగాహన,ప్రాక్టికల్  అనుభవం  లేని  చదువులు  ఎందుకు ? వ్యక్తిగా  యెదగనివ్వని చదువులు  ఎందుకు ? చదువులు  వ్యక్తిత్వ  వికాసానికి  తోడ్పడాలి , మనిషి
యెదుగుదలకి తోడ్పడాలి .విద్యారంగానికి  యెన్నో కోట్లు  ఖర్చు  పెడుతున్నారు . ఫలితాలు  మాత్రం  ఆశించినంత  స్థాయిలో  లేవు !కారణం  పెద్దలు  ఆత్మవిమర్శ  చేసుకోవాలి !

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:12 AM కామెంట్‌లు లేవు:

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 7:11 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

20, జులై 2016, బుధవారం

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 11:52 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
 మన  విద్య !!!!!!చదువు  కొంటున్నామా?కుంటున్నామా? బోధ పడడం  లేదు .ఎన్నో  విద్యాలయాలు , ఎన్నో  ఉపశాఖలు,ఎందరో  ఉపాధ్యాయులు , అయినా  నానాటికి  తీసికట్టు  నాగబోట్లు !లోపం  ఎక్కడుంది ?విశ్లేషించి  చూస్తే   నా మటుకు  నాకు  కలిగిన  కొన్ని అభిప్రాయాలను  పంచుకోవాలనుకుంటున్నాను !                                                                                                                  

ఇళ్లల్లో  పిల్లలపైన తల్లితండ్రుల  పర్యవేక్షణ  తగ్గింది . ఉదయాన్నే  లేవడం  చాలామంది  చెప్పాలంటే  మర్చిపోయారు !బడికి  వెళ్లే  అరగంట  ముందు  లేచి  గబగబా  పుస్తకాలు సద్దుకుని  ఇంత తిని  కొంత  బాక్సులో  పెట్టుకుని  పరుగెత్తడం !బడి దగ్గర  వున్నవాళ్ళ  పరిస్థితి  యిది .
 దూరంగా  వున్న బల్ల  పరిస్థితి  చూద్దాం . తెల్లారం గానే  ఇంటి  ముందు  బస్సు  సిద్ధం .నిద్రమత్తులోనే  తయారు  అయ్యి  బస్సు  ఎక్కుతారు .
ఆ బస్సు  ఊరంతా  తిరిగి  బడికి  వచ్చేటప్పటికి  దగ్గర  దగ్గరగా  రెండు గంటలు !ఇదంతా  దేనికి ? వాళ్ళు  బాగా  చదువుకోవాలాలనే  కదా ?
మరి  ఇంటి దగ్గర  తల్లి  తండ్రులు  వాళ్ళకోసం   జాగ్రత్త  తీసుకోలేరా?పిల్లల  పుస్తకాలను  చెక్  చెయ్యాలి .corrections  అయినయ్యా లేవా  చూడాలి . కాకపోతే  కారణం  అడగాలి . వాళ్ళ  /సమస్య  తెలుసుకుని  పరిష్కారం  వెదకాలి !ఎప్పుడో బుద్ధి  పుట్టినప్పుడు కాదు ప్రతి రోజు  దాని కోసం  కొంత  సమయం  కేటాయించాలి . అప్పుడు  పిల్లలలో   చదువు  మీద  శ్రద్ధ  కలుగుతుంది ,అమ్మ  నాన్న  తమని  గమనిస్తున్నారన్న  భయం  కూడా  కలుగుతుంది !తల్లి తండ్రి కూడా ఉదయాన్నే లేచి  కార్యక్రమాలు  ముగించుకుని  పిల్లలను  ఉదయాన్నే
లేచి చదువు  కోవడం  అలవాటు  చెయ్యాలి .,ఇంటి వాతావరణం  ప్రశాంతం  గా  పవిత్రం  గా  వుండాలి.రోజూ బడికి  వెళ్లేముందు  దైవ  ప్రార్ధన
చెయ్యాలి .అలాగే  సాయం కాలం బడి నించి  రాగానే  కాళ్ళు చేతులు  కడుక్కుని  బట్టలు  మార్చుకోవాలి ..ఏదైనాతేలిక  గా  తిని అమ్మ తో
సరదా కబుర్లు  కాసేపు  చెప్పి  ఆదుకోవడానికి  వెళ్ళాలి .ఒక గంట  ఆడుకుని  వచ్చి  శుభ్రం గా  స్నానం  చేసి  బట్టలు  మార్చుకోవాలి .    
బడలిక  తగ్గి  శారీరికంగా  మానసికంగా  ఉత్తెజిలవుతారు .అప్పుడు  పాఠ్య  పుస్తకాలు  తీసి  చదువుకుంటే  హోంవర్క్  చేసుకుంటే  అన్ని పాఠ్య
విషయాలు  సులభం గా  బుర్రలో కి  యెక్కుతాయి హాయిగా  అమ్మ  పెట్టిన  అన్నం తిని  కమ్మటి  నిద్ర  పోవాలి.ఇంట్లో  యీ  రకం గావాతావరణం  వుంటే ప్రతి  ఇల్లు వాణినిలయమే                                                                                                                       !  
వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 11:51 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

10, జులై 2016, ఆదివారం

మన సాంఘిక వ్యవస్థలో సామాజిక మార్పులు చక చక జరిగి పోతున్నాయి .ఎన్నో యెన్నో మార్పులు .మనం కొన్ని మార్పులు
పరిశీలిద్దాం . కుటుంబ వ్యవస్థలో పురుషుడు ఆర్ధికం గా తన కుటుంబం కోసం శ్రమించి తనవారిని సుఖపెట్టడానికి తపన పడేవాడు స్త్రీ పురుషుడి కి మానసికంగా తోడునీడ గా వుండి అతనికి అన్ని విధాలుగా తోడు నీడ గా వుండి సంసారాన్ని చక్క దిద్దుకునేది . ఉమ్మడి కుటుంబాలు !అత్తగారు ,మామగారు , మరుదులు ,ఆడబిడ్డలు అందరూ కలసి మెలసి సఖ్యత తో వుండేవాళ్ళు . చిన్న
చిన్న విభేదాలు వున్నా వెంటనే పరిష్కరించుకునేవారు . ముఖ్యంగా ఇంటి పెద్ద కు గౌరవం యిచ్చేవారు. ఆయన మాటే వేద వాక్కు
ఇంటి పెద్ద కూడా అంటే పెద్దరికం తో హుందాగా ఉండేవారు .అసందర్భ ప్రేలాపనలు , అహంకారం చూపించకుండా తన గౌరవాన్ని
నిలుపుకునే వారు .కుటుంబ సభ్యులందరినీ ఒక పద్ధతిలో నడిపే వారు .అత్తగారు కూడా కోడలిని తన పిల్ల లాగానే చూచుకుని
మంచి చెడూ చెప్పేవారు .కుటుంబంలో శుచి శుభ్రం ,నిత్యపారాయణం అన్ని పద్ధతి గా జరిగి పోతూ వుండేవి.అలాంటి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలు కూడా చక్కటి మానసిక దృక్పథం తో పెరుగుతారు . చిన్నతనం లోనే చక్కటి సంస్కార బీజాలు నాటుకున్నందువలన వారు పెద్దయిన తర్వాత సంస్కారవంతమైన పౌరులుగా కుటుంబానికి ,సమాజానికి ,దేశానికి దిశానిర్దేశకులు
అవుతారు .
నేటి ప్రస్తుత కుటుంబ వ్యవస్థ పరిశీలిద్దాం !పురుషుడు యిప్పుడు కూడా ధనార్జనే ధ్యేయం గా వున్నాడు .కానీ సమాజపు కొన్ని
ఆకర్షణలకు గురి అవుతున్నాడు .ఉమ్మడి కుటుంబాలు లేవు .ఇంటి పెద్ద అనే మాటే లేదు . తప్పు ఒప్పులను దిద్దే పెద్ద లేరు .
క్రమంగా మాబాసిక దౌర్బల్యం ఒక దురలవాటు గా మారుతున్నది .ఆర్ధిక చిక్కులు మొదలవుతాయి . ఇంటి ఇల్లాలు కూడా
సహనాన్ని కోల్పోతున్నది .ఇల్లు రణరంగం అవుతున్నది . ఎప్పుడయితే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందో అప్పుడే
కుటుంబ పతనం ప్రారంభం అవుతుంది !విలువలు దిగజారుతాయి . ఆ ప్రభావం పిల్లలమీద పడుతుంది . ఇక వారి పతనం మొదలవుతుంది . అవగాహన లేని పెంపకం లో అయోమయ అవస్థలో ఒక ధేయం లేకుండా పెరుగుతారు . ఎందుకూ పనికి
రాని పౌరులుగా తయారు అవుతారు . క్రమంగా చేతకాని తనం కాస్తా ఉగ్రవాదం అవుతుంది . దేశాన్ని కే సమస్య గా తయారవుతారు .
విశ్లేషిస్తే ఈనాటి మన కుటుంబ వ్యవస్థ లో స్త్రీ పురుషుడు ఇద్దరూ ఒకరికొకరుగా ఉండడం తగ్గిపోతున్నది . భార్యగా అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు . అలాగే పురుషుడు కూడా తన భార్య కష్ట సుఖాలను అర్ధం చేసుకోవడం లేదు . ఇద్దరి మధ్య ఆర్ధిక సంబంధం తప్ప అనురాగ సంబంధం అదృశ్యమవుతున్నది. స్త్రీ సమాన హక్కుల కోసం ప్రశ్నిస్తున్నది .నాదృష్టి లో
పురుషుడి లో ఏనాడు అర్ధభాగమయ్యిందో ఆనాడే ఆమెకు అన్ని హక్కులు వచ్చాయి . బాధ్యతలు వున్ననాడు హక్కులను
ప్రశ్నించ వచ్చును . స్త్రీ పురుషులిరువురు మమతానుబంధాలతో జీవన యానం జరిపితే వారి పిల్లలు కూడా చక్కని సంస్కారవంతమైన పౌరులుగా తీర్చి దిద్దబడతారు .
పాఠకులారా అన్ని కుటుంబాలు ఇలా వున్నాయని నేను చెప్పటం లేదు . కానీ నేడు వారి శాతం యెక్కువగా వున్నది . ప్రస్తుత
పరిణామాలు చూచిన తర్వాత నాలోని ఆవేదనకు అక్షర రూపం ఇచ్చాను . ఎక్కడయినా తప్పుగా నేను వ్రాస్తే దయచేసి
నన్ను మన్నించమని మనవి చేస్తున్నాను .ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ! సానుకూలంగా అర్ధం చేసుకుంటారని ఆశిసుస్తున్నాను.
Like
Like
Love
Haha
Wow
Sad
Angry
Comment
Share
11
Comments
Rajya Lakshmi
Write a comment...

వీరిచే పోస్ట్ చేయబడింది rajyalakshmi వద్ద 3:29 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

నా గురించి

rajyalakshmi
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

బ్లాగు ఆర్కైవ్

  • ►  2020 (1)
    • ►  నవంబర్ (1)
  • ►  2018 (1)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2017 (13)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  మే (4)
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (1)
  • ▼  2016 (24)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (3)
    • ▼  జులై (9)
      • గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో త...
      • గ్రీష్మం  లో  ప్రకృతి  కాంత కందిపోయెనమ్మ ,తపనతో త...
      • భారతీయుల  దాస్య  సంకెలలను  తెంప అవతరించిన  మహనీయు...
      • తెలుగు  తేజం  జాతీయ  తేజమై  ప్రభవించిన  రోజు !   ...
      • 10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పి...
      • 10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పి...
      •  మన  విద్య !!!!!!చదువు  కొంటున్నామా?కుంటున్నామా? ...
    • ►  జూన్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (5)
  • ►  2015 (21)
    • ►  డిసెంబర్ (4)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (5)
    • ►  సెప్టెంబర్ (6)
    • ►  ఆగస్టు (5)
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.