27, అక్టోబర్ 2015, మంగళవారం

కదలిక కావాలి (రావాలి)

భారత నారి  గౌరవానికి  మర్యాదకు  సకల  జాతులకే  తలమానికంగా  నిలిచింది , మన  సనాతన  ధర్మంలో  , మన  వేదాలలో  స్త్రీ  స్థానం  ఉన్నతం ఆనాటి  పురుషుడు! మహిళకు  సంకెళ్ళు  బిగించలేదు . ప్రతి  రంగంలో  సమాన
విలువ  యిచ్చాడు . మరి  యిప్పుడు  మనం  అన్నిరంగాలలో  మహిళలు పురోగమనంలో  వున్నారు . వున్నతంగా  జీవిస్తున్నారు .  కాని  మనం  జీవిస్తున్న  యీ  సమాజంలో  యెందుకు  యిన్ని  మానభంగాలు ?
అంతేకాదు  చంపడాలు, ముక్కలు ,ముక్కలు  గా  కోయదాలు !యేమిటి  యీ  వికృత  ధోరణి ? మానవుడు
దానవుడుగా  మారుతున్నాడు .  రావణాసురుడు  సీతను  బంధించాడు ,కానీ ,అంత  దానవుడు  కొంత  కట్టుబాటుకు  తల  వంచాడు .  యినాటి  యీ  నేర ధోరణి  ఆనాటి  రాక్షసులకన్నా  దారుణంగా  వున్నది .
రోజూ  దినపత్రికలో  వార్తలు  చదువుతున్నా ,t.v  లో  చూస్తున్నా మనసంతా  చెదిరి  పోతున్నది . మనదేశంలో
పాపాయి  భూమిమీదికి  వస్తూ  తనతో  పాటే   యీ  అత్యాచార విష సర్పాన్ని  మెళ్ళో  వేసుకుని  వస్తున్నదేమో !
నెలల  పిల్ల  దగ్గరినించి ,పండు  ముదుసలి  దాకా  ఆడ  అయితే  చాలు  కామం  తీర్చుకోవడానికి !మొన్ననే
పేపర్లో  చదివాను  ఒక  కామపిశాచి పూడ్చిన  స్త్రీ  శవాన్ని  బయటకు  తీసి   కోరిక  తీర్చుకున్నాదు .  వాణ్ని  చంపినా  పాపం  లేదు / చిఛీ /అసహ్యం  వేస్తోంది .ఆకాశం లో  సగం  అని  చెప్పుకోవడానికే  ఆడాళ్ళు  వున్నారు /
ఆచరణలో  శూన్యమ్ .
అసలెందుకిలా  జరుగుతున్నది ? ఎక్కడుంది  లోపం ? మనిషి  మెదడులో  యీ  కలుపు మొక్కలు  విష వలయాలుగా  అల్లుకు  పోతున్నాయి . వాటిని  వేళ్ళతో  తుంచెయ్యాలి . క్రూరమైన  ఆలోచనలు  యెందుకు
వస్తున్నాయి ?జాలి  దయ ,మానవత్వం  అనే  పదాలు  మాయమైపోయాయి !మనసమాజంలో  విలువలకు
వలువలు  వలస  వెళ్ళాయి . సంస్కారాన్ని  మన  పదకోశంలో  కప్పెసాం . సమయం  వచ్చేసింది ,ప్రతి  పాఠశాలలొ  తప్పని  సరిగా  విలువలను  బోధించాలి . పెద్దవారు  అనుభవజ్ఞులు , విద్యావంతులు ,మన  రామాయణం  ,
వేమన శతకం  భాగవతం    అందులోని  మానవతావిలువలు  వివరిస్తే  యిన్ని  అనర్ధాలు  జరగవు . ప్రతి  వ్యక్తి
ప్రతి  అమానుష  చర్యను  ఖండించాలి . మనలోని  అలసత్వాన్ని  తరిమెయ్యాలి ,జాతిని  కాపాడుకోవాలి .
మనకెందుకులే  ,మనింట్లో  కాదుగా  అనే  ధోరణి  మారాలి . సమాజం  మనదే  సమస్యలు  కూడా  మనవే !క్ట ఒక  మహిళను  చంపేసి  గొనెసంచీలొ  కుక్కేసి  గోడలో  పెట్టేసి  ప్లాస్ట రింగ్  చేసారంటే వాళ్ళు  అసలు  రాక్షసులే !
పక్కింటి వాళ్ళకు  యింతపని  జరుగుతున్నా  చప్పుడు  వినిపించలేదా ?తప్పకుండా  వినిపిస్తుంది  కానీ
మనకెందుకులే  అని  వూరు కున్నారు . ప్రతి వాళ్ళు  మనచుట్టుపక్కల  కదలికలు  గమనిస్తూ వుండాలి .  అనుమానం  వస్తే  అందరూ  కలిసి  నిలదియ్యాలి . నీతిమాలిన  చర్యలను  అరికట్టాలి .
   

18, అక్టోబర్ 2015, ఆదివారం

నా భావాలు: నారీ నీవే నవదుర్గవు!

నా భావాలు: నారీ నీవే నవదుర్గవు!: నవరాత్రులు  మొదలయ్యాయి . ఎటుచూసినా  అమ్మవారి  పూజలే . బాలగా  లలితగా  చండికగా  అన్నపూర్ణగా గాయత్రిగా  శైలపుత్రిగా  రాజరాజేశ్వరి గా  ఆ  తల్ల...

17, అక్టోబర్ 2015, శనివారం

నారీ నీవే నవదుర్గవు!

నవరాత్రులు  మొదలయ్యాయి . ఎటుచూసినా  అమ్మవారి  పూజలే . బాలగా  లలితగా  చండికగా  అన్నపూర్ణగా
గాయత్రిగా  శైలపుత్రిగా  రాజరాజేశ్వరి గా  ఆ  తల్లి  మనలను  కరుణ ,తీక్షణ ,వీక్షణలతొ మనల్ని  నిరంతరం  గమనిస్తున్నది .  స్త్రీమూర్తిలోని  వివిధ  కోణాల  అల్లికే  యీ  నవరాత్రుల  విశేషం . బాలగా  పుట్టింటి  ముత్యాలముగ్గు .  లలితగా  అత్తింటి  నట్టింటి నడయాడే  సజీవ  చైతన్య  రాశి . అన్నపూర్ణగా  అందరి కీ ఆకలి
తీర్చే  చల్లని తల్లి . సహనానికి  రాజరాజేశ్వరి !యిన్ని  కోణాలలో మరో విభిన్నకోణం  అన్యాయాన్ని  అధర్మాన్ని
అణగదొక్కే  అపర  చండిక . ఈ  దేశం మహిళను  గౌరవించి  మహోన్నత  పదవిలో  నిలిపింది . భారత  మహిళ
కనిపిస్తే  అన్యదేశ  ప్రజలు తలవంచి  నమస్కరిస్తారు .  మరి  మనసంస్కృతి  దిగజారి  గమ్యం  లేని  పయనానికి
బాటవేస్తున్నది .  మహిళలు   అన్నిరంగాలలో  దూసుకెళ్ళ్తున్నారు . రోజుకో  నిర్భయ  అకృత్యం .  ఎక్కడుంది
లోపం ?చౌక బారు  చలన చిత్రాలు  t.v  సీరియళ్ళు  ఆగాలి .  మగువను  లలితంగా  చూపించాలి . వెకిలి  మాటలను కట్టడి  చెయ్యాలి
. జగద్గురువు  శ్రీ  శంకరాచార్యులవారు   సౌన్దర్యలహరిలొ  అమ్మవారిని  యిలా  స్తుతించారు
మనస్త్వం  వ్యోమత్వం  మన రుదసి  మరుత్సారథి  రసి
త్వమాప  స్త్వం  భూమి  స్త్వయి  పరిణతాయాం  న  హి  పరమ్ 1
త్వమేవ  స్వాత్వానం  పరిణమైతుమ్  విస్వవపుషా
చిదానందాకారం  శివయువతి  భావేన  బిబృషే

తల్లీ  ఆజ్ఞాచక్ర మందున్న  మనస్తత్వం  నీవె  విశుద్ధ  చక్రమందున్న  ఆకాశ తత్త్వం  నివే  అనాహత  చక్రమందున్న
వాయుతత్వం  నీవే  స్వాదిష్టాన  మందున్న  అగ్ని  తత్త్వం  నీవే  మణిపూర  మందలి ఆప్తత్వం  నీవే  మూలాధార
చక్రం మందలి  భూతత్వం నీవె


శంకర  భగవత్పాదులు  తెలిపినట్టుగా  స్త్రీ  అన్నిభావాల  కలయిక !

12, అక్టోబర్ 2015, సోమవారం

ఆలోచనలు - ఆచరణలు

ద్సష్టిలో  ప్రతిజీవి  కి  మనసు ,హృదయం ,మెదడు  వున్నాయి .  ప్రతి  జీవి  తనదైన  భాషను  వాడుతుంది . అన్ని  జీవుల  భాషలు  అన్నిజీవులకు  అర్ధం  కావు . భావం  ఒకటే  అయినా  భావప్రకటన  భాష  వేరు . గోమాత  పలికే
"అంబా "లో  యెన్నో  భావాలు !సునిశితం గా  పరిశీలిస్తే  ఆ  అరుపులో  ఆవేశంలో  ఒకరకంగా ,ఆవేదనలో  ఒకరకంగా ,ఆప్యాయతలో  ఒకరకంగా  భావాలు  పలుకుతాయి . అలాగే  ప్రతిజీవి  తన  భాషలో  తనభావాలను తెలుపుతుంది . మనం  బుద్ధి జీవులం !బుద్దితో  అలోచించి  సంస్కారమైన  భాష  వుపయోగించి భావ  ప్రకటన
చేస్తాము .పశువు  ఆలోచిస్తుంది , మనం  ఆలోచిస్తాం . పశువు  ఆలోచనలు  సమాజాన్ని  ప్రభావితం  చెయ్యవు .
కానీ  మన  ఆలోచనలు   భాష  ఎదుటి  మనిషిని  ప్రభావితం  చేస్తాయి . అందువల్ల  పర్యవసానం  ఎలా
వుంటుందో!కాబట్టి  ఆలోచనా సరళి సక్రమంగా  వుండాలి . ఆలోచన  సక్రమం ,ఆచరణ  సక్రమం  అయితే  అందరు హాయిగా  వుంటారు . అలేగ్జాందర్  ఎంతో  తెలివిగలవాడు  కాని  ఆలోచన  ఆచరణ  సరిగా  లేవు .  చరిత్రలో  నిలిచినా  నరహంతకుడిగానే  నిలిచి  పోయాడు . గాంధీజీ  ఆలోచన  ఆచరణా  సక్రమం  అవటం  వల్ల  మహాత్ముడు  అయ్యారు ,జాతిపితగా  అందరి  మనసుల్లో  నిలిచిపోయారు .
 మన  ఆలోచనే  మనల్ని  విజయపథంలోకి  నడిపిస్తుంది . ఆలోచనాప్రవాహానికి  దిశా నిర్దేశం  కావాలి . ఒకసమస్య  దానికి సక్రమ  ఆలోచన ,ఆలోచనలోనించి  సక్రమ  పరిష్కారం ,నిర్మాణాత్మక  ఆచరణ  యివే  మనిషిని  మనీషి గా  నిలబెడుతాయి . భ్రమలో  జీవించ వద్దు ,భ్రమ  అనే  మత్తులో  తేలవద్దు ,సత్యంలో  జీవించి  సత్యాన్వేషణ  చేసినప్పుడే  ఆలోచనలు  సత్ఫాలిస్తాయి . లేనిది వూహించుకుని ,మెదడును  మనసును  కలుషితం  చేసుకోకూడదు . నిజం  లోనించి  నిజాయితీ  నిలబడాలి . 

11, అక్టోబర్ 2015, ఆదివారం

నా భావాలు: మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం ల...

నా భావాలు: మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం ల...: మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం లో మనం వు న్నా మా అని త లు కాచు కుంటే రో త పుడ్తు న్నది ,నే టి సమా జం లో వున్నది కే వలం మహ...