అత్యాచారాలు ,ఆత్మహత్యలు ,వార్తలు చదవని ఒక్కరోజు
కోసం ఎదురు చూడాల్సిన
పరిస్థితి వచ్చింది !దోచుకోవడాలు దోపిడీలు ,పిల్లల్ని
ఎత్తుకెళ్ళడాలు !!!! మన సమాజం ఎటు
వెళ్తున్నది ? టెక్నాలజీ పెరిగింది
కాబట్టి పురోగమనం అనుకుందామా
లేక మనసనేది చచ్చిన తిరోగమనమనుకుందామా ? విపరీత ధోరణికి కారణం
యేమిటి ? పరిష్కారమే లేని
సమస్యలా? చిన్ని చిన్ని
చిన్నారి బాలికలు యే పాపం
చేసారు ? మృగాళ్ల బలిపశువులు
అవుతున్నారు !శిక్షలు లేవా! న్యాయ
వ్యవస్థలో లొసుగులు చట్టాలు
వాడుకుని సులభం తప్పించుకుంటున్నారు !న్యాయస్థాన తీర్పులు
వీళ్లల్లో మార్పు తేలేకపోతున్నాయి ! మానసికం గా పరివర్తన
రావాలి! ఎలా ? గృహ
వాతావరణం కట్టుదిట్టం గా వుండాలి!తల్లి ,తండ్రి పిల్లలకు బాల్యం
నించే విలువలను బోధించాలి !ఆడపిల్లలకు నడవడికలు ,నేర్పాలి
!మగపిల్లలకు సమాజం లో
గౌరవం గా మెలగడం
నేర్పాలి !అలాగే బళ్ళల్లో ఉపాధ్యాయు లు
చదువో తో పాటు సంస్కారం బోధించాలి!యువత మానసిక
రోగులుగా తయారవుతున్నారు !నా
దృష్టిలో వాళ్ళ అబ్బాయిలు
అమ్మాయిలపై అత్యాచారం చేస్తే
వెంటనే అబ్బాయిల తల్లి తండ్రులను పోలీస్
స్టేషన్ కి పిలిపించి
చేత అబ్బాయిలకు లాగి
చెంప పగలగొట్టించాలి !తరువాత సంగతి
తరువాత !అబ్బాయిలకు అక్కయ్య కానీ చెల్లి కానీ వుంటే వాళ్ళచేత కూడా
చెంప పగల గొట్టించాలి !
అబ్బాయిలకు డబ్బు యిచ్చినా అప్పుడప్పుడు ఎలా ఖర్చు పెడ్తున్నాడో ఒక కన్నేసి
ఉంచాలి !ఇవన్నీ సాధ్యమా అనుకుంటారు
కదూ!తల్చుకుంటే సాధ్యమే !తల్లి
తండ్రులు యెవరికోసం సంపాదిస్తున్నారు ?పిల్లలకోసమే కదా ?భవిష్యత్తు బాగుండాలంటే తప్పనిసరిగా వాళ్ళు కఠినంగా వుండాలి !అలాగే అమ్మాయిలు
కూడా అనవసర ప్రసంగాలు
చేస్తూ రెచ్చగొట్టే ధోరణి
మానుకోవాలి !తీరా రెచ్చకొట్టి
వాడు దగ్గరకు వస్తే
తప్పెవరిది ?మగపిల్లలతో మాట్లాడడం
తప్పులేదు ! విపరీత ధోరణి
పనికి రాదు ! మన ఖర్మ కాలి
యిప్పుడు వచ్చే సినిమాలన్నీ వింత టైటిల్స్
రోతపుట్టె కథలు !ముందు ఈ రకం
సినిమాలు ఆగాలి !సమాజం లో సానుకూల
మార్పులు రావాలంటే ప్రతి వ్యక్తి
ప్రశ్నించే ధోరణి అలవరచుకోవాలి !విపరీత ధోరణులకు
అడ్డుకట్ట వెయ్యాలి !మనం ,మనసమాజం మనమే కదా ! భవిష్యత్తు
సమాజం మనదే కదా !