24, మార్చి 2016, గురువారం

Alas  This is not what I thought life was
I knew there were crimes and evil  men
Misery and hate,nor did I hope to pass
Untouched by suffering,through the rugged glen

In mine own heart I saw as  in glass
The hearts of others-And when
I went among my kind,with triple brass
Of calm endurance,my weak breast Iarmed
To bear scorn fear and hate,a woful mass

P. B.sHELLEY


 జీవితం  యిలా  వుండేదని  నేను  ఎప్పుడూ  ఆలోచించలేదు
అక్కడ  యెన్నో  నేరాలు  యెంతో  చెడు  వుండేదని  నాకు  తెలుసు
లోభత్వం  అసహ్యం  వుండేదని  నాకు తెలుసు ,అంతేకాదు
బాధలను  ,కరకు  రాతి  గుండెలను  తప్పుకోలేనని  తెలుసు  కున్నాను !


నా స్వచ్చమైన  హృదయ  గాజుపలక  నుండి  తొంగి  చూసాను
అన్ని  మనస్తత్వాలు  నాకు  వివరంగా  తెలిసిపోయాయి
నాలోని  నన్ను    మానసికంగా  గట్టి  పరిచాను
ఓర్పుతో  క్షమతో   నా  సున్నిత  హృదయానికి
అవహేళన , చీత్కా రాలను , నీచ  మనస్తత్వాలను  భరించే  కవచాన్ని  తొడిగాను 

22, మార్చి 2016, మంగళవారం

వేయిపడగలు  -- 4వ  అధ్యాయము --
గత  3అధ్యాయాలు  గతవైభవాన్ని  తెలుపుతాయి . 4వ  అధ్యాయము  లో  మారుతున్న  మనుషుల  మనస్వత్తాన్ని  చాలా  బాగా  తెలిపారు . రంగారావు  పట్టాభిషేకం !రంగారావు  గారి తండ్రి   నాయుడుగారు

 ప్రజల  వ్యవహారం  లో  చాలా  వుదారం  గా  వుండేవారు .ప్రజల  అన్ని  అవసరాలు  ఆదుకునేవారు .అంతే  కాదు  కళా  పోషకులు  కూడా ! విశ్వనాథ  సత్యనారాయణగారు కోటను  వర్ణించిన  తీరు   !'కోట  కు సింహ ద్వారమొకటి వెనుక  ద్వారమొకటి  వుండెను . కోట  ఆంగ్లేయులు పూర్తి గా  దేశము స్వాధీ నము  కానపుడు  కట్టినది  కాన
కోటగోడ  కొండ రాతితో  కట్టబడి  ఒక  శక టము  సునాయాసముగా  పోవుటకు  వీలైనంత  యెడము   కలదై  కందకమును  కూడా  కలిగి వుండెను . కందకము  పాడుపడి  వున్నది . వూరున్న వైపు కందకము  పూడ్చ బడి  వున్నది .  కొన్ని యెడల  కోటగోడ  శిథిల మై  పోయెను . అది మరల  మరమ్మత్తు  చేయుటకు  దొరతనము  వారి  అనుమతి  లేక యట్లే  వున్నది . '
కోట  వర్ణన  చదువుతుంటే  అసలు  మనం  కోట  పక్కన  నిలుచున్న  భావం  కలుగుతున్నది  కదూ !తెల్లదొరల
పాలన  లేనప్పుడు  ప్రజలు  యెంత  స్వేచ్ఛగా  వున్నారో  యెంత  హాయిగా  వున్నారో  అలాగే  తెల్లదొరల  పాలనలో  కోట  మరమ్మత్తుకు  కూడా  వారి  అంగీకారం  కావలసిన  దయనీయ  స్తితిని  తెలుపడం  లో  కవి  ఆనాటి  సమాజపు  మనిషి  ఆలోచనలను  తెలిపారు .
మరో వర్ణన 'కోట  విశాలమైన పదివేల  మంది జనులు  సుఖముగా  నివసించుటకు వీలై నదిగా  వుండెను .    కోటలో  నెల్లెడ  వున్నతములైన   వృక్షములు  దిగుడు  బావులు  ఫల వృక్షములు  బహు  జాతులు  గల  
తీ వలు  కలవు !కోటలో దక్షిణ  దిశ  యందు  పెద్ద  సావడి  లో  బోనులలో  సమర్పబడి  పులులు
చిరుతలు  సివంగులు  కొరనాసి గండ్లు  కోతులు  మొదలైన  అపూర్వ  జంతువులు  నానాజాతి  పక్షులును
పెంచబడుచుండెను !వానిని  చూచుటకు కొత్త వారెప్పుడును  వచ్చుచునే  యుందురు !కోటయే  వస్తు ప్రదర్సన
శాల ;కోటయే  పుస్తక  భాండాగారము ;కోటయే  విద్యా  పోషణ  సం స్థ !కోటయే  తల్లి !కోటయే  తండ్రి !కోటయే
స ర్వముగా  యుండేది '
కవి  భావుకత  కవి  కాల్పనిక  శక్తి  యెంతో  యెంతో  మధురం !అసలు  ఆయన  వేయి  పడగలలో  జీవించారు !
ప్రతి  చిన్న  అంశము  చదువుతుంటే  మనం  కూడా  అక్కడ  ఒక  పాత్రగాజీవిస్తాం
కవి  సార్వభౌమా  మీకు  శిరస్సు  వంచి  ప్రణ మిల్లుతున్నాను !
 

21, మార్చి 2016, సోమవారం

వేయి  పడగలు ! మూడవ  అధ్యాయములో  కవి  గారు   గిరికను  యెంత  బాగా  వర్ణించారో !
'ఆ  నవ్వినది  పన్నెం డేం డ్ల  పిల్ల !దాని  యొడ లి  పైకి  తెలియకుండ  మన్మథుడు  వచ్చు  చున్నాడు . దాని  తెల్లని  పలు వరుస  సుద ర్శ నా యుధపు టంచుల వలె  పదునుపెట్టి  నట్లుండెను .  దాని  చెవులు  శ్రికారములై
పాంచ జన్యము  లట్లుండెను . దాని  కన్నులు  కమలములు ,దాని  నాసిక  కౌ మో దకి .దాని   భ్రూ యుగము  శా రజ్ఞము    ద్విథా  విభక్త మైనట్లుండెను . దాని  మూర్తి  వికుం ఠ  మై  మనొజ్ఞ  మయ్యెను . దాని  పేరు  దేవదాసి '
ఈ వర్ణన  యెంత  మధురం !లేలేత  అందాలను  యెంత  కమనీయంగా  తెలిపారు !నేను  చదివి  మైమరచిపోయాను !

6, మార్చి 2016, ఆదివారం

మన వెల లేని గతం ఈ నాడు విల విల లాడుతున్నది

మన  భారత  దేశం  వున్నత విలువలకు  నెలవైన  బంగారు  పాలవెల్లి . మానవీయ  విలువలకు  ప్రపంచదేశాల కే
తలమానికం !అన్నిదేశాల  ప్రజలు   సమాజంలో  ఎలా  మెలగాలో  భారతియసమాజం  దగ్గర  నేర్చుకున్నారు .
ఆ  నాటి  ఆ  మహోన్నత  విలువలే  ఈ  నాటికి  మన  భారతీయుడు  కనపడగానే అప్రయత్నంగా  రెండు  చేతులు  జోడించి  అంజలి  ఘటించే లా  చేసాయి . కానీ  ఈ  మాధుర్యం  గతం లో కి  జారింది . నేడు  ఆ  సంస్కృతి  ఎక్కడ !
మన  నడవడి ఎందుకిలా  జారింది !పశ్చిమ దేశాలు వారి సంస్కృతిని మన  మీద  బలవంతంగా  రుద్దలేదు .
వారిలోని అలవాట్లను మన  జీవన  విధానానికి  అనువైనవి  మనం  గ్రహించాలి !వారి వాతావరణ  నాగరిక
ప్రభావం  వారి  జీవనవిధానం!వారికి  మనలాగా  తరతరాల చరిత్రలేదు .ఆటవిక  జీవనం లో  నించి  బాహ్య
ప్రపంచం లో  కి  వచ్చి తమకంటూ  గుర్తింపు తెచ్చుకుంటున్నారు సంస్కారాన్ని  సంస్కృతిని  వెతుకుతున్నారు మరి  మనపెద్దల  ద్వారా  లభించిన  అపార  సంస్కార  సంపద  వుంది ,చెరగని  సంస్కారం  వుంది ,కారణం ఏమిటి ఎందుకిలా  తయారవుతున్నాము ?బయటి వాళ్ళెవరు  మనల్ని  యిలా  వుండమని  ప్రోత్సహించడం  లేదు ,మన  మానసిక  దౌర్బల్యమ్  మనల్ని  పతనం  లోకి  లాగుతున్నది !మనకు  అన్ని  సుఖాలు  అనుభవించడం  అలవాటయింది ,దాని  వల్ల మంద  బుద్ధి ,బద్ధకం  మొదలయ్యాయి . .టెక్నాలజీని  వాడుకుని  సమయాన్ని  సద్వినియోగం  చేసుకొమ్మన్నారు  కానీ దుర్వినియోగము  చేసుకోమన లేదు !మన  దైనందిక  కార్యాలను  త్వరగా  ముగించుకుని  ,మనలోని  చైతన్యాన్ని  ఆలోచనలను  క్రమ  దిశలో  వాడుకోవడమే  టెక్నాలజీ  యొక్క  లక్ష్యం !ప్రస్తుత  దారుణ  మైండ్  సెట్  మారాలి ,వక్ర  ఆలోచనలను  తుంచి  వేయాలి ,ముందుగా  ఎలక్ట్రానిక్  మీడియాలో  కొన్ని  ప్రోగ్రాములను  కట్టడి  చెయ్యాలి ,అశ్లీ ల  సాహిత్యాన్ని ,దృశ్యాలను  కట్టడి  చెయ్యాలి ,!
 గృహ వాతావరణం  లో  చక్కటి  సంభాషణలు ,చక్కటి  సంస్కారం  వుండాలి ,బూతు మాటలు ,వెక్కిరింతలు ,హేళన మాటలు ,వుండకూడదు !ఇంట్లో  పెద్దవాళ్ళు ప్రతిమాట  ప్రతి చర్య ,చాలా  జాగ్రత్తగా  చాలా సున్నితంగా  వుండాలి ,ఇళ్ళల్లోని  క్రమ పద్ధతులే  యువతకు  క్రమ శిక్షణ  నేర్పుతాయి !.అలాగే  యువత  కూడా  చదువు తో  పాటు  ఏదో ఒక  లలిత కల  మీద  పట్టు  సాధించాలి !శారీ రికంగా  అలసి  పోయినప్పుడు   మధుర సంగీతం
మనసుకు  హాయి  కలిగిస్తుంది !      

3, మార్చి 2016, గురువారం

వేయిపడగలు  తొలి  రెండు  అధ్యాయాలలో  ప్రాముఖ్యత  గల  పాత్రలు  ---రామేశ్వర శాస్త్రి ,కృష్ణమనాయుడు ,వారి  ఆప్యాయతలు  మరియు  స్నేహబంధం !తొలుతగా  నా  దృష్టి  లో ,
రామేశ్వర శాస్త్రిగారు ---ఈయన  సుబ్బన్న పేటలో  5వ  తరానికి  చెందిన  వ్యక్తి -సుందర రూపి ,ఔదార్యులు ,పాండిత్య ప్రతిభ  కలవారు .నాలుగు  వర్ణముల  వారిని  పెళ్లి  చేసుకున్నారు ,అంతే  కాక  రత్నగిరి  అనే  భోగంగాన ను  చెరదీసా రు . అయన లోని  యితర  సుగుణముల  వలన ,ఆయన  చేసుకున్న  వివాహముల
విషయాలు  మరుగున  పడుతాయి . అలాగే  భార్యల  పట్ల  అయన  ప్రవర్తించిన  తీరు  కూడా  చాలా  హుందాగా
వున్నది . తనకున్న  ధనం  అందరి  అవసరాలకు  వాడుతారు  ,నిరతాన్న దాత !ప్రజాక్షేమం  కోరే  వ్యక్తిగా  అందరి  మన్ననలు  పొందుతారు . ఆలయంలో ధ్వజస్తంభానికి  బంగారపు  తొడుగు  వేయించడం ,సత్యభామాదేవికి  మాణిక్యము  పొదిగిన  అడ్డబాస  చేయించడం .ఈ  పనులన్నీ శాస్త్రి  గారి  లలితభావ  జలాన్ని  కళ్ళముందు  నిలబెట్టుతాయి ,కొన్ని  కొన్ని  సంఘటనలను  చదువుతుంటే    విశ్వ నాధులే  కళ్ళ  ముందు  నిలుస్తారు .
ఇల్లు  గడవని  రోజులలో  కూడా  వితరణ  గుణం  మనల్ని  కట్టి  పడేస్తుంది ,రామేశ్వర  శాస్త్రి  పాత్ర  సజీవ  పాత్ర
కృష్ణమనాయుడు -రాజు ,పురోహితులు  వ్యవస్థను  సక్రమంగా  నడిపినప్పుడే  సమాజం  వర్ధిల్లుతుంది .
నాయుడు గారు ,శాస్త్రిగారు ఆత్మ గౌరవాన్ని  కాపాడుకుంటూ  స్నేహబంధాన్ని  నిలుపుకుంటారు . వారి  మనసులు  మాట్లాడుకుంటాయి ,నాయుడుగారు  శాస్త్రిగారి  అప్పులన్నీ  చాలా  చాకచక్యంగా  తీర్చి  ధర్మారావుని  ఆదరించిన  తీరు  వర్ణ నాతీతమ్ !