11, మార్చి 2017, శనివారం
నా భావాలు: సప్తవర్ణ హరివిల్లులో మెరుపు తీగను ! ...
నా భావాలు: సప్తవర్ణ హరివిల్లులో మెరుపు తీగను ! ...: సప్తవర్ణ హరివిల్లులో మెరుపు తీగను ! ...
సప్తవర్ణ హరివిల్లులో మెరుపు తీగను !
రాగాల వీణలో మధుర తంత్రిని !
సప్తస్వర నాదం లో శ్రావ్య గీతికను ! అందాల విరుల తోటలో సున్నిత గులాబిని!
సాగర సంగమ తీరం లో అలల జలఝరిని !
వసంత ఋతువున విలాస రంగుల వీచికను !
నవచైతన్య నవ పరిమళ నాట్య మయూరిని నేను నేస్తమా !!

7, మార్చి 2017, మంగళవారం
మహిళలకు సమాజం లో వున్నతస్థానం వుంది !ఆదినించి మన భారతీయసమాజం లో విశిష్టమైన పాత్ర స్త్రీ ! వేదయుగం లో స్త్రీ పురుషులతో సమం గా సాహిత్య రంగం లో తన రచన వ్యాసంగాన్ని కొన సాగించింది . రాజకీయరంగం పరిపాలనా చాతుర్యాన్ని చాటింది .ఇల్లాలిగా తన ధర్మాన్ని నెరవేర్చింది . కానీ ఈ రోజు అదే స్త్రీ సమానహక్కుల కోసం పోరాడుతున్నది . ఈ పరిస్థితి యీ పరిణామం యెలా మొదలు అయ్యింది ?హక్కు కోసం
స్త్రీ పోరాడుతున్నది అంటే ఆమె ఒకవిధం గా ఓటమి ఒప్పుకున్నట్టే కదా ! హక్కు ఒకళ్ళు యిస్తే పుచ్చుకునేది కాదు ! స్త్రీ కి ఆదినించి అన్ని హక్కులు వున్నాయి ! కుటుంబ వ్యవస్థను ముఖ్యంగా వివాహ వ్యస్థను చిన్నాభిన్నం
చేయడానికి అందులో మన భారతీయ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఇది ఒక సాధనం!ఎప్పుడైతే వ్యవస్థ
అస్తవ్యస్తం అవుతుందో అప్పుడు సమాజాన్ని దెబ్బతీయవచ్చు !స్త్రీ తన వ్యక్తిత్వం తన హక్కుగా తీర్చి దిద్దుకోవాలి !మహిళ నిరంతర చైతన్య తేజోపుంజం !

5, మార్చి 2017, ఆదివారం
ఆకాశం లో సగం అన్నారు ,అవనే నీదన్నారు!
పుడమి తల్లి ఒడిలో చిన్నారివి నివేనన్నారు !
చిరునవ్వుల కలల వెలుగువు నివేనన్నారు
వన్నెతరగని పసిడి పూబాలవన్నారు
మమతల మానవత్వమా మధుర స్మృతిగా
మణిమయ దీపికగా మల్లెల తావిగా పరిమళించు !
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన నా చిన్ని కవిత !

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)