ప్రేమంటే అర్ధమే తెలియని లేతబాల్యం లో ,
అందమైన ఆటలెన్నో తోటలో ఆడుకున్నాం ,
కోయిలమ్మ తీయ తీయని కుహుకుహూ లతో మైమరిచాం ,
నా పాటలో నీ మాట కలిపి భావాలను పంచుకున్నాం ,
సాగర సంగమ తీరం లో వడి వడి అడుగుల పరుగులు ,
ఎన్ని యుగాలైనా చెదరని చెరగని నవ చైతన్య జాడలు ,
సన్నజాజుల పరిమళాలలో మమతల మాలలల్లుకున్నాం ,
సన్నని వానతుంపర్లలో బొమ్మరిల్లు కట్టుకున్నాం ,
పంచదార చిలకలను పంచుకుంటూ తియ్యతియ్యగా నవ్వుకున్నాం ,
బాల్యపు మాధుర్యాలను మనసంతా నింపుకున్నాం ,
కాలగతిలో దూరతీరాలకు పయనమై తరలిపోయాం ,
అందమైన బాల్యం కనులముందే కదిలిపోయింది ,
అందరానంత దూరాన యెవరికి వారమయ్యాం ,
కానీ ఆనాటివిరితావుల సుగంధాలు యీనాటి మన మధుర జ్ఞాపకాలే కదా , మానసిక బంధాలకు మధుర భావనలకు భాషయెందుకు??
దైహిక బంధాలకు అతీతం గాఐ ఊపిరి లో ఊపిరిగా యెన్నడో కలిసిపోయాం నేస్తమా !!!