మన సమాజం మానవ సమాజం !ఏ ఖండం లో వున్నా యే దేశం లో వున్నా అందరి భావాలూ ,భావప్రకటనా ఒకే విధంగా వుంటాయి . ఆలోచనా విధానం కూడా ఒకే రకంగా వుంటుంది . కాకపోతే ఆయా పరిసరాల భాషల వాతావరణ పరిస్తితుల వల్ల వారి ప్రవర్తన వారికి అనుకూలం గా మార్చుకుంటారు . నేను
యెందుకు యిలా అలోచిస్తున్నానంటే సాధారణంగా పల్లెటూరి వ్యక్తికీ ,పట్టణ వ్యక్తికీ ,పెద్దనగరంలో వుండే వ్యక్తికీ మరో దేశంలో వుండే వ్యక్తికీ మానసిక ,శారీరిక స్తితి ఒకటే కానీ తను వున్న సమాజాన్ని బట్టి తప్పని సరిగా
తాను మారాలి ,లేకపోతే ఆ వాతావరణంలో యిమడ లేడు . నేను పల్లెటూరిలో పుట్టాను ,మా వూళ్ళో అన్నీ చిన్న చిన్న యిళ్ళు ,దగ్గర దగ్గరగా వుండేవి . తెల్ల తెల్ల వారు తుండగానే అందరూ లేవల్సిందే !మా అమ్మ
నేను కళ్ళు తెరచి చుసేటప్పటికే స్నానం పూజా ముగించి వంట దగ్గర వుండేది . బామ్మా యేదో పని చేస్తూనే
వుండేది ,మాతాతయ్య కూడా బజారు పని చేస్తూ వుండేవారు . నాన్న బడి కి సైకిల్ మీద వెళ్ళేవారు . నేను
అన్నయ్య అన్నం క్యారియర్ తీసుకుని బడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం . ఆరోజుల్లో చాలా శుభ్రంగా
వుండేది . మా మాస్టార్లు యెంతో నిదానంగా కోప్పడకుండా పాఠాలు చెప్పేవారు . మా చదువంతా యెంతో హయిగా సాగింది . మాకు tutions లేవు , యేదయినా అర్ధం కాకపోతే నాన్న చెప్పేవారు . సాయంకాలం
యింటికి రాగానే కాసేపు బామ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళం ,కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని చుట్టు పక్కల పిల్లలందరం కలిసి రకరకాల ఆటలు ఆడేవాళ్ళం ,కొద్దిగా వెలుతురు వుండగానే
యింటికి వచ్చేవాళ్ళం !మళ్లీ కాళ్ళు కడుక్కుని మాస్టార్లు యిచ్చిన పాఠాలు చదువుకొని హోంవర్క్ చేసుకుని
భోజనానికి సిద్ధం !నాన్న ,నేను ,అన్నయ్య ఒకేసారి తినే వాళ్ళం ,అప్పుడు నాన్న బళ్ళో పాఠాలు గురించి
అడిగేవారు ,మమ్మల్ని అన్నం తిన్నతర్వాత మన దేశాన్ని గురించి నాయకుల గురించి ,మంచి అలవాట్ల
గురించి చెప్పేవారు ,మాకు అవన్నీ వింటుంటే యేదో తెలియని భావాలూ వచ్చేవి .!యీ లోగా అమ్మ ,బామ్మ
అన్నాలు తిని వంటిల్లు శుభ్రం చేసి బయటకు వచ్చేవారు .!నేను బామ్మ దగ్గర ,అన్నయ్య తాతయ్య దగ్గర
పడుకునే వాళ్ళం !తాతయ్య ,బామ్మా మాకు రామాయణం మహాభారతం కథలు చెప్పేవాళ్ళు ,మధ్య మధ్య
ప్రశ్నలు వేసేవాళ్ళు ,అలా అలా వింటూ నిద్ర పోయేవాళ్ళం !
ఇంతకూ నేను చెప్ప బోయేది ,అది పల్లెటూరి జీవనం !మా పెళ్ళిళ్ళు అయిపోయి పట్టణానికి వ చ్చాం !మా
అమ్మా నాన్న మాతోనే వచ్చారు ,కాలధర్మం బామ్మా తాతయ్య వెళ్ళిపోయారు . అన్నయ్య ,వదిన ,నేను మా
ఆవిడా ,నాన్న అమ్మా ,నాలుగు గదుల యిల్లు అద్దెకు తీసుకుని వున్నాం !అమ్మ వయసు పెరిగినా తెల్లారంగనే నిద్ర లేచి పనులు మొదలు పెట్టేది ,నేను అన్నయ్య యెంత వద్దన్నా వినేది కాదు .,మా వదినకు
ప్రతి పనీ వివరంగా కావాలి అందువల్ల యే దీ త్వరగా అయ్యేది కాదు ,చిక్కులు మొదలయ్యాయి !ఒకరోజు
నాన్న అందరినీ సమావేశ పరిచారు .,అందరికీ వారి వారి భాద్యతలు చెప్పారు .!వదిన వుదయాన్నే లేచి
స్నానంముగించుకొని వంటకు వెళ్ళాలి ,మా ఆవిడ వదినకు సాయం చెయ్యాలి ,అన్నయ్య బజారు సరుకులు
తేవాలి ,నేను అమ్మకు నాన్నకు సాయం చెయ్యాలి !అన్నయ్యకు కవల పిల్లలు పుట్టారు ,కొత్త సభ్యుల
రాకతో వాతావరణమే మారింది .అవసరాలు మారాయి ,వదిన పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకోవడం
కష్టం అయింది ,అమ్మకు ఓపిక తగ్గింది . క్రమంగా వదినకు పని యెక్కువ అయి విసుగు వచ్చేది , ఇంట్లో
చికాకులు మొదలయ్యాయి . ఒకరోజు నాన్నకు గుండెపోటు వచ్చి కూర్చున్న వారు కుర్చున్నట్టుగానే పోయారు అన్నయ్యకు బదిలీ ,అన్నయ్య,వదిన పిల్లలు మరో పెద్ద నగరానికి వెళ్లారు ,నేను మా ఆవిడా అమ్మ ఒకచోట వున్నాము మొదటి సారి ఒకటిగా వున్న కుటుంబం రెండుగా అయింది /అన్నయ్య పిల్లలు ఇంగ్లీష్ మీడియం బళ్ళో చేరారు /స్కూల్ బస్సు వచ్చేది /వదిన మిక్సీ గ్రైన్దర్ కొనుక్కున్నది /అన్నయ్య
కారు కొనుక్కున్నాడు /జీవన విధానం మారింది /కానీ పిల్లల పెంపకం బాగుండేది /బాగా చదువుకుని
డిగ్రీ పూర్తి కాగానే అమెరికా వెళ్ళిపోయారు /నాకు ఆడపిల్ల పుట్టింది /అమ్మ పెంపకం లో పద్దతిగా పెరిగింది
బాగా చదువుకుంది /నా స్నేహితుడి కొడుకు సూర్యం బ్యాంకు లో పని చేస్తున్నాడు ,మా అమ్మాయి నచ్చింది /అన్నయ్య ,వదిన పిల్లలు వచ్చారు /వున్నంతలో పెళ్లి చేసాను /అతనికి డిల్లీ లో వుద్యోగం /అన్నయ్య పిల్లలు
అమెరికాలో స్థిరపడ్డారు /కాలక్రమంలో అక్కడి వాళ్ళను పెళ్లి చేసుకున్నారు /ఇప్పుడు నేను అన్నయ్య వదిన
మా ఆవిడా ,అమ్మా కలిసి వున్నాం /అమ్మ యీ మధ్యనే కాలధర్మం చేసింది /
నేను యెందుకు వ్రాస్తున్నానంటే జీవితం చక్రభ్రమణం /తిరిగి అక్కడే మొదలు !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి