యాంత్రికజీవితంలో మనం మన సున్నిత బంధాలను మర్చిపోతున్నామా అనిపిస్తున్నది . ప్రతివాడికి తన చుట్టూ ఒక వలయం !అందులో తనవారు !ఇతరుల గురించి తనకవసరం లేదు ! కానీ తనకు యేదయినా ఆపద కలిగితే అందరూ పలకరించాలి !అంటే మనిషి అంతరాంతరాలలో యెక్కడో ఒక సున్నితపొర వుంది .
అది తొలగాలి . చెన్నై ప్రళయం మానవ విలువలను తట్టి లేపింది . అందరూ ఒకరికి ఒకరుగా పలకరించుకున్నారు . కులమతాలకు అతీతము ఆప్యాయతలు వెల్లివిరిసాయి . మనం కనీసమ్ వారానికి ఒక్క సారయినా హాయిగా మనసు విప్పి కబుర్లు చెప్పుకుంటే యెంత బాగుంటుంది ,అన్న భావం అందరిలో కలిగింది ఈ t.v ,మొబైల్ ,ఐపాడ్ కట్టి పెట్టి కనీసం వారం లో ఒకరోజు రెండు గంటలు అమ్మ ,నాన్న ,బామ్మ తాతయ్య బాబాయి ,అత్తయ్య మనవళ్ళు ,మనవరాళ్లు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే
యెంత బాగుంటుందో !ఎంత మధురమయిన అలోచన !ఆలో చనే ఇంత అందంగా వుంటే ఆచరణ యింకా యెంత మధురం !మనం మన పిల్లలకు యివ్వ వలసినవి కేవలం ఆస్తులే కాదు , మానవ బంధాలను కూడా
మధురంగా తెలుపాలి . అప్పుడే సమాజంలో సానుకూలత వెల్లి విరుస్తుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి