4, డిసెంబర్ 2015, శుక్రవారం

తల్లీ ప్రకృతీ మన్నించమ్మా

మనం  యెంతో  సాధించాం ,అంతరిక్షంలో  దూసుకెళ్తున్నాము ,ఆహా  ఓహో  అనుకుంటాం కానీ నిజమా 1యేమో  ?
ప్రకృతిని  జయించాం  అనుకుంటాం   కానీ  మన  భ్రమ !పంచ  భూతాలముందు  తల  వంచాల్సిందే !యింత  టెక్నాలజీ  మనకున్నది .వరదలను  ఆపగలిగామా ?చెన్నయిలో  ఆ  వాన  పోకడను చూస్తె  నాకైతే  యేదో  తీవ్రమైన  శాప ఫలితమా  అనిపిస్తున్నది . పవర్ కట్ .దోవలన్నీ  జలమయం ,నిత్యావసర  వస్తువులు  కోసం  వీధిలొనికి  వెళ్ళలేని  పరిస్తితి ,కోటీ శ్వరు డయినా  తడుముకోవాల్సిన  పరిస్తితి !పేరున్న  వైద్యాలయం  జనరేటర్లు
పని  చేయక  వెంటి లేటర్ల  మీద  వున్న  రోగులకు  ఆక్సిజన్  యివ్వలేక  వాళ్ళందరూ  మరణించారు . దయనీయమయిన  సంఘటన !ఎందరు  చిన్నారులు ,యెందరు  తల్లులు ,యెందరు  బాలింతలు  తల్లడిల్లుతున్నారో !భగవంతుడా  శాంతించు !మా  తప్పిదాలను  కరుణతో  మన్నించి  క్షమించు !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి