నా భావాలు
5, నవంబర్ 2020, గురువారం
24, ఏప్రిల్ 2018, మంగళవారం
మిత్రులారా ! శుభోదయం ! ప్రపంచ దేశాలు మనదేశాన్ని వారి సాంఘిక సామజిక ఉన్నతికి మార్గ సూచిక గా
అభివర్ణించాయి !భారతీయ కుటుంబ వ్యవస్థ ఆప్యాయత ,అనుబంధాలతో ముడిపడింది ! భారతీయ విద్యావిధానం పిల్లలను సంస్కరించింది !క్రమశిక్షణను నేర్పింది !తల్లితండ్రులు ,గురువులు ,బాల్యం లోనే విచక్షణ వివేకం ఉగ్గుపాలతో రంగరించారు !గృహ వాతావరణం లో స్త్రీ పట్ల గౌరవం సద్భావాన్ని నేర్పారు ! మగపిల్లవాడికి ఆడపిల్లల
పట్ల మెలగవలసిన పద్ధతులను తెలిపారు !హద్దుదాటని సంస్కారం నేర్పారు !మరి నేడు భారతదేశం లో యెందుకు
యిన్ని అత్యాచారాలు ,యెందుకు యిన్ని మానభంగాలు ? చిన్ని పాపాయి యే పాపం చేసింది ? పాఠశాల కుర్రవాడు
పాశవిక ఆలోచనలు ఎలావస్తున్నాయి ? ఎక్కడుంది లోపం ?తల్లి పెంపకమా?గారాబంగా ? స్వార్ధమా?ఆడపిల్ల
అంటే చులకన భావమా?దయచేసి మిత్రులారా మీ విశ్లేషణ తెలపగలరు ౧ ఇలాగే వ్యవస్థ కొనసాగితే భవిష్యత్తులో అనాగరిక సమాజం యేర్పడుతుంది!దానికి మనమంతా బాధ్యులమే !!!!

2, అక్టోబర్ 2017, సోమవారం
ఈమధ్య కాలంలో నన్ను ప్రభావితం చేసిన పుస్తకం 'ఏడు తరాలు ' ఆంగ్లం లో హేల్లెక్స్ గారు 'ది రూట్స్ ' పేరిట తన అనుభవాలను వ్రాసారు ! సహవాసి గారు తెలుగు లోఅనువదించారు !ఆంగ్లమూలం చెడకుండా భావాలను
తెలిపారు !
నాగరికత నవసమాజం కేవలం ఒకరి సొత్తుకాదు !మానవ ఇతిహాసం లో కొన్ని నగ్నసత్యాలు సకల మానవాళికి తెలిసిననాడు ప్రతి ఒక్కరూ స్పందించి తీరుతారు !మనసులోతులో కల్లోల అలలు యెగసిపడక తప్పదు !ప్రస్తుత
సమాజం లో మనం యాంత్రిక జీవనం లో మనబంధువులను, కన్న తల్లితండ్రులను ,అసలు యెవ్వరి గురించి
ఆలోచించం !కనీసం ప్రయత్నం కూడా చెయ్యం ! అలాంటిది ఒక వ్యక్తి ఏడుతరాల క్రిందటి తనమూలాలను వెదుక్కుంటూ యెంతో లోతుగా పరిశీలన చేస్తూ తాను అనుకున్న గమ్యానికి చేరడం చాలా గొప్పవిషయం !శతాబ్దాల కిందటే ఆఫ్రికా మారుమూల గ్రామాల్లో పరిపాలనా వ్యవస్థ వున్నదని నిర్బంధ విద్య వున్నదని తెలిసి విస్తుపోయాను !ఏడుతరాల బానిస యదార్థ విషయాలు చదువుతుంటే మనసంతా మూగపోతుంది !తెల్లవాళ్లు
దాతలుగా నల్లవాళ్ళు గ్రహీతలుగా వుండే వ్యవస్థ పోయి సమాన భాగస్వాములుగా వుండే సామాజిక వ్యవస్థకోసం నల్లజాతివారి తపన ఆరాటం మనో భావ సంచలనం 'ఎదుతరాలు ' ప్రతిధ్వనిస్తాయి !
రెండు ఖండాలు , రెండు జాతులు ,రెండు శతాబ్దాల యదార్ధ వ్యధా చరిత్ర !రచయిత వాషిగ్టన్ ప్రాచీన పాత్రభండాగారం వెళ్లి తనవారి పేర్లు వెతుక్కుని ఆఫ్రికా భాష మాండింకా తెలిసిన వారిని కలవడం చాలా గొప్ప విషయం !గాంబియా వెళ్లి తాతముత్తాతలు పుట్టిన గ్రామం జాపూరును దర్శించడం ,బానిస బతుకుల వ్యధను
పుస్తకరూపం లో వ్రాయడం నిజం గా మానవాళి గర్వించ గల విషయం !మూడు ఖండాలు తిరిగి ప్రాచీన పత్ర భాండాగారంలో విషయాలు సేకరించి సమకాలీన ఆఫ్రికా జీవన సరళి ప్రతిబింబమే 'ఏడు తరాలు ' మన పాఠకులు అందరూ వీలైతే తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి !

27, సెప్టెంబర్ 2017, బుధవారం
ప్రతి మనిషి లో మరో వ్యక్తిత్వం తప్పనిసరి !అంతర్లీన ఆలోచనలు భావాలూ మెరుగుపడిన స్మృతులు అసలుమనిషి జాడలు మనకు తెలియకుండానే తెలుపుతాం! ఒకరోజు ఆలా కళ్ళుమూసుకుని ఆలోచనలలోనికి నన్ను నేను తొంగి చూసుకున్నాను !కలం నన్ను పలుకరించింది ! గళం పలుకమన్నది !కానీ మనసుమాత్రం మరోలోకం లో
మధుర మురళిని ముద్దాడింది !నల్లనయ్య మోహన వంశి అలలతేరుపై నాముందు వాలింది ! నిజం !సాగరతీరం ,
సంధ్యాసమయం పున్నమి రేయి జాలువారే వెన్నెల జలతరింగుణుల మధుర డోలికలు !ప్రకృతిని మించిన సౌందర్యమున్నదా ? పట్టణజీవితాలలో మనం సున్నితత్వాన్ని పోగొట్టుకుంటున్నామేమో కదా ! వానతుంపర్లలో లేలేత గడ్డిపరకల తళతళలాడే నీటిబిందువుల మధ్యలో చిన్ని చిన్ని పక్షుల వయ్యారాలు ! విరుల వనిలో గులాబీరెక్కలపై మంచుబిందువులు మల్లెల మందస్మిత దరహాసాలు బాలభానుని బంగారు కిరణాలు! ఇంతకన్నా
జీవితానికి ఇంకేం కావాలి !తెలియని భావావేశం కనుల కొలనులో చుక్కై పెదాలను తడిమింది !
అందెల రవళుల పదమంజీరములు
సరిగమల సవ్వడి సొగసుల తెలుప
కలువ కనుల కాటుకరేకలు కరగని
కమనీయ కలలను కన్నుల తెలుప
చిలిపినవ్వుల చిన్నారిపెదవులు
సిరిమల్లెల సొగసులు విరబూయ
పయనమాయె నా మానస మయూరి
పురివిప్పిన శిఖిపింఛ మౌళికై మిత్రమా !

17, సెప్టెంబర్ 2017, ఆదివారం
చిటెక్నాలజీ పెరిగింది !మరి దాని పరిణామాలు ?స్వేచ్ఛ జన్మహక్కు !ఎప్పుడు ?పెడదారి పట్టనంతకాలం ! పిల్లలకు తల్లితండ్రులు అన్ని వసతులు యేర్పరుస్తున్నారు!చాలా సంతోషం ! కానీ పర్యవేక్షణ మర్చిపోతున్నారు .ఒకవిధం గా యువతలో అభద్రతాభావం వారిని వక్రమార్గంలోకి తోస్తున్నది !రోజూ పిల్లలదగ్గర కూచుని బళ్ళో విషయాలు అడిగి తెలుసుకోవాలి !వాళ్ళు చెప్పేది వినాలి !కానీ నేటి తల్లితండ్రులకి ఆ ఓపికలేదు !బడి నించి రాగానే వెంటనే ట్యూషన్ కి పంపెయ్యాలి !అక్కడినించి రాగానే డిన్నర్ ! అప్పుడు కాసేపు వాళ్ళని దగ్గరగా ప్రశ్నించితే సమస్యలు తలెత్తవుగా స్వేచ్హహకు హద్దుగియ్యాలి !పిల్లలతో పెద్దలు సాంకేతిక విషయాలలో అవగాహన కలిగివుండాలి !అతిస్వేచ్ఛ వినాశనానికి మార్గం యేర్పరుస్తుంది,పాఠశాలలు కూడా విద్యార్ధులపై నిఘా ఉంచాలి ,మనం మొక్క నాటుతాం !రోజూ నీళ్లు పోస్తాం! దాని యెదుగుదల ఆకుపచ్చని ఆకులు చూసి ఆనందిస్తాం !అదేసమయంలో మొక్కకు మట్టి ఎరువు ఆలోచిస్తాం !పురుగు పడితే మందు వేస్తాం !మార్గాలు వెతుకుతాం !పిల్లలూ మొక్కలాంటి వారే !తప్పు వారిది కాదు !పెద్దల్లారా కళ్ళు తెరవండి !సంపాదన పిల్లలకోసమేగా ?మరి ఆ పిల్లలే విషవలయం లో క్కుకుంటే మీ సంపాదన వాళ్ళను వైద్యుల చుట్టూ తిప్పటానికి సరిపోతుంది ! ధనార్జనలో పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మర్చిపోవద్దు ప్లీజ్ !
3, జూన్ 2017, శనివారం
చితిలో కాలేది తనువు, చింతల కూలేది మనసు !
మమతల బంధాలకు మౌనమే మరణమా?
కలువ కనుల కురిసిన కన్నీరు కడలిని తాకేనా ?
విధి రాతలో వసివాడిన సన్నజాజి నవ్వేనా ?
కాలగతిలో చుక్కలు వెలుగు తోవ చూపేనా ?
మనసును నమ్మిన మనసమ్మినా, మిగిలేది మిగిలేది కన్నీరే మిత్రమా !!

28, మే 2017, ఆదివారం
సన్నజాజి పరిమళం పిల్లతెమ్మెర నెత్తావి
సిరిమువ్వల రవళి పదమంజీర హంసధ్వని !
నీలినింగి చినుకుల జల్లు కడలి అలల ఊయల !
పల్లవించిన మనసు పులకిత వనమయూరి !
సలలిత సంధ్యాసుందరి తూరుపు అధరపు మధువు !
పున్నమి జాబిల్లి వెన్నెల జలతారు చల్లని కిరణం ! పచ్చని ప్రకృతి పుడమి తల్లి కదంబపుమాలేకదా నేస్తమా !!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)