10, సెప్టెంబర్ 2015, గురువారం

రకరకాల రుచులు

దహీపూరి -2 బంగాళా దుంపలు ,శెనగలు 1/2కప్పు ,పెసలు 1/2కప్పు ,ఆకుపచ్చ బఠాని 1/2కప్పు ,అల్లంవెల్లుల్లి  ముద్ద 1/4స్పూన్ ,జీలకర్రపొడి 1/2స్పూన్ ,కారం 1/2స్పూన్ ,ఉప్పు  తగినంత కావాలి .
శెనగలు ,పెసలు ,బఠాని  కలిపి  గంటసేపు  నానపెట్టాలి .  తర్వాత  కుక్కర్లో  పెట్టి  మెత్తగా  వుడికించాలి .   దీనికి
అల్లంవెల్లుల్లి  ముద్దను ,కారం ,జీలకర్రపొడి ,వుప్పు  కలపాలి . అప్పుడు  మనం  చేసిన  పూరి  తీసుకుని  మధ్యలో
చిన్నగా  గుంటలాగా  నొక్కాలి . అందులో  ఈ  కలిపిన  ముద్దను  పెట్టాలి . దినిమీద  దహి  చట్నీ  పోసుకోవాలి ,చిటి కెడు  చాట్  మసాలా  చల్లుకోవాలి . దహిపురీ  తయ్యార్ .
దహీచట్ని -పెరుగు 1కప్పు ,కొబ్బరిపొడి 2స్పూన్లు ,పంచదార  2స్పూన్లు ,పండుమిర్చిముద్ద 1స్పూన్ ,నల్లవుప్పు
చిటి కెడు  వుప్పు  తగినంత . పెరుగులో  యివన్నీ  కలుపుకోవాలి . దాహిచట్ని  తయ్యార్ .
పానీపురి -తగినన్ని  పూరీలు ,ఆకుపచ్చ  బఠాని 1కప్పు ,బంగాళా దుంప 1,చింతపండు  గుజ్జు 1స్పూన్ ,కారం 1స్పూన్ ,చాట్ మసాలా 1/2స్పూన్ ,కొత్తిమీర 1కట్ట ,వుప్పు  తగినంత . బఠానీ ,ఆలు  మెత్తగా  వుడికించాలి .
ఈ  ముద్దకు  వుప్పు ,చాట్ మసాలా ,కొత్తిమీర కలిపి  వుంచుకోవాలి . ఒక  గ్లాసు  నీళ్ళు  తీసుకుని చింతపండు
గుజ్జు ,కారం ,వుప్పు  కలుపుకోవాలి . ఇప్పుడు  పూరీని  మధ్యలో  గుంట  నొక్కుకుని  అందులో  ఆలూ బఠానీ  మద్దను పెట్టి  రెడీగా  వున్న చితపండు  నీళ్ళల్లో  ముంచి  తినాలి .
సగ్గుబియ్యం వడ -సగ్గుబియ్యం 1కప్పు ,వుడికించి తొక్కు తీసిన  బంగాళా దుంప 1,వేయించిన కచ్చాపచ్చాగా
దంచిన  పల్లీన్లో /2కప్పు ,చీల్చిన  పఛిమిర్చి 2,జీలకర్ర 1స్పూన్ ,కొత్తిమీరతురుము 2స్పూన్లు వుప్పు  తగినంత
నూనె  వేయించడానికి  తగినంత . సగ్గుబియ్యం 3సార్లు  కడగాలి . నీళ్ళుపోసి  6గంటలు  నానపెట్టాలి . బాగా
నానిన  ముద్దకు  మిగిలినవి  అన్నీ  కలిపి  మెత్తగా  ముద్ద  చెయ్యాలి చిన్న  చిన్న  గారెలుగా  చేసి నూనెలోaవేయించుకోవాలి .సగ్గుబియ్యమ్  వడలు  తయ్యార్
సెనగపిండి  బర్ఫీ -సెనగపిండి 1కప్పు ,నెయ్యి 1కప్పు ,పాలపొడి 1కప్పు ,పంచదార ఒకటిన్నర కప్పు ,నీళ్ళు
2కప్పులు -బాణలిలో  నెయ్యి  కరిగించి  పచ్చి  వాసన  పోయేదాకా  సెనగపిండి  వేయించుకోవాలి . గిన్నెలో
తీసుకుని  పాలపొడి  వేసి  బాగా  కలపాలి ఒకగిన్నెలో  నీళ్ళు  పంచదార  తీసుకుని  సన్నని  మంట తో  వుండ  పాకం  రానివ్వాలి దాన్లో  సెనగపిండి  మిశ్రమం  కలపాలి  దగ్గరగా  వచ్చేదాకా  సన్న  సెగ  మీద  వుంచి  దించెయ్యాలి వేడి  చల్లారాకా  బిళ్లలుగా  కోసుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి