పుట్టుక మనచేతిలో లేదు . కానీ ఆ జీవితాన్ని మలుచు కోవడం మన చేతిలో వుంది . మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి .అలాగే మన శరీరం కూడా ఆరోగ్యంగా వుండాలి . నాకు తెలిసిన కొన్ని విషయాలు
వ్రాస్తున్నాను .
మెంతులు ఆకలిని కలిగిస్తాయి . ఒక్కోసారి మనకు తినాలనే ధ్యాసే వుండదు . అప్పుడు మెంతి పొడిని మొదటి ముద్దలో తింటే ఆకలి పుట్టి యితర అధరువులను కలుపుకోవాలనిపిస్తుంది .
మెంతులు శరీరంలో అన్ని భాగాలకు శక్తి యిస్తాయి .
మెంతి ఆకు మెత్తగా నూరి కొద్దిగా నెయ్యి కలిపివుడికించి ఎంత పెద్ద గడ్డ పైన వేసి కట్టినా గడ్డ పగులు తుంది .
మెంతియాకు మెత్తగా నూరి పెరుగుతో కలిపి తలకు పట్టించుకుని ఆరిన తర్వాత తల స్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది .
రోజూ వుదయాన్నె పళ్ళు తోముకున్న తర్వాత లేత వేపచిగురు తింటే పొట్టలో పురుగులు నశిస్తాయి .
కొవ్వు కరగాలంటే పొద్దున్నే ఒకగ్లాసు నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని తాగాలి .
అల్లం ముక్కలు నీళ్ళల్లో బాగా మరిగించి వడ కట్టి కొద్దిగా తేనె కలుపుకొని తాగితే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది .
ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు కొన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే రక్తప్రసరణ బాగుంటుంది .
రాత్రి 2 లేక 3బాదం పప్పులు నానబెట్టి పొద్దున్నే పొట్టు తీసి తింటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది .
కలబంద రసంలో ధనియా పొడి వేసుకుని తాగితే పొట్ట చుట్టూ వున్న కొవ్వు తగ్గుతుంది .
ప్రతిరోజూ ఒక అరటిచేస్తూ పండు తింటే రక్తపోటును నివారించవచ్చును .
ఆహారంలో పాలకూర వాడడం వల్ల కూడా రక్తపోటు control చెయ్యచ్చు
నారింజరసం high B P CONTROL చేస్తుంది .
జుట్టు రాలకుండా వుండాలంటే ఆలివ్ నూనెలో రెండు చుక్కల నిమ్మరసం వేసి తలకు బాగా మర్దన చెయ్యాలి
. \ బాగా యింకిన తర్వాత కుంకుడు రసంతో తల కడుక్కోవాలి .
కరివేపాకును బాగా మెత్తటి ముద్ద చేసి కొద్ద్దిగా కలబంద గుజ్జు కలిపి జుట్టుకు రాసుకుని ఆరిన తర్వాత
తలరుద్దుకోవాలి . జుట్టు నల్లగా వస్తుంది .
కరివేపాకు ముద్దలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకుని గంట తర్వాత స్నానం చెయ్యాలి . ఇలా
వారంలో రెండుసార్లు చేస్తూ వుంటే చుండ్రు పోతుంది
కొబ్బరినూనెలొ కొన్ని కరివేపాకులు వేసి బాగా వేడి చేసి వడ కట్టాలి . ఈ నూనె రోజూ రాసుకుంటే జుట్టు
వూదదు
దగ్గు తగ్గాలంటే మిరియాల చూర్ణం నెయ్యి చక్కెర కలిపి ఒక టీ స్పూన కొన్ని రోజులు తీసుకుంటే దగ్గు
తగ్గుతుంది
.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి