20, ఫిబ్రవరి 2016, శనివారం

మరణం

Death is  here and death is there                                                                                                              
Death is busy everywhere,                                        
all around,within,beneath
Above is death-and we are death

Death has set his mark and seal
On all we are and all we feel
On all we know and all we fear

First our pleasures die and then
our hopes and then our fears and when
These are dead the debt is due we die too

All things that we love and cherish
like ourselves must fade and perish
such is our rude mortal lot
love it self would, did they not

                                                    - P B Shelly

మరణమిక్కడ ,మరణమక్కడ
అంతటా  విశ్రాంతి  లేని  మరణమే
మరణమే  వలయం ,మరణమే  లోన ,మరణమే  క్రింద
మరణమే  పైనా -సందేహమేల  మనమే  మరణమా

మరణమే నాడో  తన  ముద్ర  వేసింది
మరణ  ముద్రలో  మరణ  భావనలో
మన  యెరికలొమరణమే ,మన  భయంలో  మరణమే 

కోరికలు శూన్యమై ఆశల న్నీ
ఆడి యాసలై ,భయమే  లేని నాడు
బంధాలన్నీ తెగిన  వేళ , మృత్యువే  కౌగిలి

అనుభవించిన  మధుర  స్మృతులు
ఆవిరైన  వేళ ,మమతలు  కరిగిన  వేళ
భౌతిక బంధం  తెగిన  వేళ
ప్రేమయే  మరణించిన  నిజమే  కదా  
                                                 

18, ఫిబ్రవరి 2016, గురువారం

ఆణిముత్యాలు

నాకు  నచ్చిన  కొన్న్ని  ఆణిముత్యాలు ,వేయిపడగలు
అందమైన  పదాల  పొందికలో ,కల్పనా శైలి లో  ఈ  నాటికి  యెవరు  సాటి  రారు !
నేను  మెచ్చిన  మచ్చు  తునుకలు భావి  రచనా  పరిచయాన్ని  మనం  అందుకుంటే  ఈ  క్రింది  వాక్యాలలో  చూడవచ్చును ,
"వేసంగి  మండుటెండలు  లేత  రావిఅకుల మీద  పడి  ధగ  ధగ  లాడి  కదలినపుడు ,త ళ త ళ  మెరయు  గోధుమ వన్నె  త్రాచుల  పడగలవలె  ప్రకా శించు  చుండెను . రావి  యాకుల  చిన్ని చిన్ని తోకలు ,చాచిన  నాల్కలవలె  తోచెను . దూరమున  ఆకాశములో  తెల్లని  సన్నని  మబ్బులు  పలుచనై  చెర లాడి -తెల్లత్రాచులు  మసక లాడినట్లు ,పడగలు  విప్పినట్లు ,ఒకదానిపై  యొకడు  దూకి  కరచుకొన్నట్లు ,,పరవళ్ళు  తొక్కినట్లు  నానా రీతుల
గోచరించెను ,ఎండ  యేమో  కస టె క్కి  మహభుజంగమొకడు  కుపితమై  బుస్సుమని  పడగ విప్పి  తోక మీద  లేచి  నిలచినట్లు ,దుర్నిరీక్ష్యమైపోయెను '
ఈ  పదాల  పొందికలో  తొలి సంధ్య  నుండి  మలి  సం ధ్య  దాకా  అన్ని  గోచరమవుతాయి .
ఆలయంలోని  వేణు గోపాలుని  వర్ణన
'స్వామి  విగ్రహం  మనిసి యంత  యెత్తు  కలది .  నిత్యము  నర్చకుడు  రాయుచున్న  నూనె చేత  తడిసి  మైమరు  వె డ మిచ్చిన  తావుల  స్వామి  శరీరము  ప్రా వృ షే ణ్య  నీ ల జలద స్నిగ్ధ చ్చాయా  ముగ్ధమై  క్రొత్త కాటుక  కాంతులు  విరియ జల్లు  చుండెను ,స్వామి ముఖ కమలమున  అంటించిన  రజత మాణిక్య  మయమైన  ఊర్ధ్వ
పుండ్ర ములు  గోలోక  ద్వారము  వలె ,స్వామి  వంక  బొమలు  ముడిచి  పరిహాసముగా  చూచుచున్న  రాదికాదేవి  ద్విభ్రూమధ్యగత  త్రిరేఖా కృతి భక్తలోక  మనః ఆహ్లాదిని  యయ్యెను ,వ్యత్యస్త పాదార విం దుడై  వేణువు  వాయించుచున్నట్లు  చేయించిన దా  మూర్తి !ప్రక్కను సత్యభామా  దేవి -శృ గారమయ  మూర్తి !కుడిచేత  విలాస
కమలము  ధరించి  పొందికగా  స్వామి  నత్తుకొని  యుండెను!భగవంతుడిని  అందరము  చూస్తాము  కానీ  వర్ణన
ఆయనకే  సాధ్యము !ఆ  మహనీయునికి  నా  వందనాలు
వేయిపడగలు  మన  యింట్లో  వుంటే  భావ దరిద్రం  మనకు  ఉండదుగా ! 

17, ఫిబ్రవరి 2016, బుధవారం

వేయిపడగలు నా అనుభూతి

విశ్వనాథ సత్యనారాయణగారు  2వ  అధ్యాయములో  సుబ్బన్న పేటలో  5వ  తరాన్ని  మారుతున్న  విలువలను
సంధి యుగాన్ని  కళ్ళకు  కట్టినట్టు  వివరించారు ,అసలు  ఆయన  మనవ మనస్తత్వాలను  చదివిన  మహాముని !
రామేశ్వర శాస్త్రి  గారితో  మొదలవుతుంది
5వ  తరం లో ముఖ్య పాత్రలు  రామేశ్వర శాస్త్రి ,గారి  కుమారుడు  ధర్మారావు ,జమిందారు  కృష్ణమనాయుడు  మరియు  అయన  కుమారుడు  రంగారావు .
రామేశ్వర శాస్త్రి  వ్యక్తిత్వాన్ని  చాలా  మహోన్నతంగా  తీర్చి  దిద్దారు . నాలుగు వర్ణాల  కన్యలను  వివాహమడడము అందరికీ  న్యాయం  చేయడం  పాత్రని  మలిచిన  విధానం  కమనీయం !మానవత్వం  ,,అయన  అమూల్య  సంపద
.తన  సంపదను  నలుగురి  కొరకు ఖర్చు  పెట్టారు  అయన  ఉదార గుణం  చివరకు  ఆయనకే  బంధం  అవుతుంది . విశ్వనాథవారు  మనుషుల  ప్రవర్తనను  ధనం  వున్నప్పుడు  ఎలా  వుంటుందో  లేనప్పుడు  ఎలా  వుంటుందో
కళ్ళకు  కట్టినట్టుగా  తెలిపారు .
జమిందారు   ,కృష్ణమనాయుడు  రామేశ్వర శాస్త్రి  స్నేహ బంధం  చాలా  అపురూపం !ఒకరి  మనసు  ఒకరు  చదివినవారు . పరస్పరం  గౌరవించు కుంటూ  స్నేహాన్ని  కాపాడుకున్నారు క్రిష్ణమనాయుని  కొడుకు  రంగారావు
శాస్త్రిగారి  కొడుకు  ధర్మారావు . శాస్త్రి గారి  మొదటి భార్య  సావిత్రి ,ఆమె  కొడుకు  ధర్మారావు .,యిద్దరు  పుత్రికలు
హైమవతి ,నాంచారమ్మ .,రెండవ భార్య క్షత్రియస్త్రీ  రంగాజమ్మగారు  ఆమె  కొడుకు  రామచంద్రరాజు ,మూడవభార్య
వైశ్య స్త్రీ  హైమవతి  ఆమె  కొడుకు  ఆమెకు  యిద్దరు  పుత్రికలు ,ఒక  కొడుకు  శ్రీధరం ,ఇక  నాల్గవ  భార్య  మంగ
ఆ  అమ్మాయిని  శాస్త్రి  గారు  విచిత్ర  పరిస్తితులలో  పెళ్లి  చేసుకుంటారు ,ఆ మెకు  వింత రూ
పుకల  కొడుకు  పసిరిక  పుడ్తాడు ,శాస్త్రిగారు  రత్నగిరి  అనే  భోగాంగ న  ను  కూడా  చేర దీ సారు ,ఆమె  వలన  దేవదాసి  పుట్టింది ,రామేశ్వర శాస్త్రి  గారు మరణించేనాటికి  ధర్మారావు  వయసు  పదహారు యేళ్ళు ! కృష్ణమనాయుడు  నాయుడు
శాస్త్రిగారి  కర్మకాండకు  కావలసిన  ద్రవ్యసాయం  చేస్తారు . ఆ  రోజుల్లో  స్నేహ బంధం  ఎలావుండేదో  వేయిపడగలు
మనకు  చూపుతున్నది ,అభిమానధనుడు  ధర్మారావు ,,మానసికంగా  మరణించి  లేఖ  వ్రాసిన  విధానం
వర్ణనకు  అందదు ,కృష్ణమనాయుడు ,ధర్మారావును  ఆదరించిన  తీరు  అపురూపం !ఈ అధ్యాయములో  మారుతున్న  తరం  మారుతున్న  మానవ విలువలను ,సామాజిక  మార్పును  బాగా  విశ్లేషించారు !క్రమంగా
రంగారావు  ప్రవేశం  అన్నింటిలో  మార్పు !

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

వేయి పడగలు మరపురాని అనుభూతి

కవిసామ్రాట్  శ్రీ  విశ్వనాథ  సత్యనారాయణగారి  వేయి పడగలు  చదవని  తెలుగు  వారు  వుండరేమో !రచనా శిల్పం  వూహకు  అందనిది ,కేవలం 29 రోజులలో  ఆశువుగా  చెప్పడం ,వారి  సోదరులు  వ్రాయడం ,మానవ మాతృ కులకు  సాధ్యమా ?మన తెలుగు  వారు  చేసుకున్న   పూర్వజన్మ  పుణ్యమే  అయన  ఆవిర్భావం !కల్పనా శక్తి
పాత్రల  సృష్టి ,అభ్యుదయ శైలి ,పదాల  పొందిక  నన్ను  పరవశింప  చేసింది .
సుబ్బన్నపేట  పుట్టుక _ఒక  పెదకాపు  తన  సురభి   అనే  గోవు  పుట్టలోని  సర్పానికి   పాలు యివ్వడం  చూసి
ఆశర్యంతో   తన వారికి  చెప్తాడు . ఆ  రాత్రి  అతనికి  వేయి శిరస్సులతో  సుబ్ర మ ణ్యె శ్వరుడు  గుడి  కట్టమని  పలుకుతాడు . పాపం  వారి  ఆర్ధిక లేమితో  నిస్సహాయులు !పొరుగు  గ్రామం లో  ఒక  ఆస్తిపరుడైన  బ్రాహ్మణుడు
తనకు  సంతానం  కలిగితే  స్వామి  సన్నిధిలో  వుండి  ఆలయ  ప్రయత్నం  చేస్తానని  మ్రొక్కుకుంటాడు . ఆ  పిదప
అతనికి  పుత్రోదయం !నాగేశ్వర శాస్త్రి  నామకరణం !ఆ యన  స్వామివద్దకు  చేరుతారు ,ఆలయ  నిర్మాణం  ఆలోచిస్తారు . అయన జ్యోతిష్య ,వాస్తు  బాగా  తెలిసినవారు ,ఒకరోజు  యీయన  వద్దకు  వీరన్న  అనే  వ్యక్తి  వస్తాడు . అతని  వద్ద  గల  ధనముతో  కోటకట్టి  జమిందారు  అవ్వాలన్న  కోరికను  వెలిబుచ్చుతాడు . తానున్న
ప్రదేశమే  కోటకు  యోగ్యమని   బ్రాహ్మణుడు  చెప్తారు . ఆలయనిర్మాణం ,కోట నిర్మాణం  మొదలవుతాయి .
ఆలయం లో  సుబ్రమ ణ్యె శ్వరులు ,నాగేశ్వర స్వామి ,కొలువవుతారు . విరన్ననాయుడు  వేణుగోపాల స్వామి  ఆలయం  కూడా  నిర్మిస్తారు .,ఆలయ నిర్మాణం తో  అన్ని  వసతులు  ఏర్పడు తాయి ,
కాపు  కు  ఒక్కతే  కూతురు ! ఆ  అమ్మాయిలోకి  అప్పుడప్పుడు  స్వామి  ఆవేశి స్తారు ,ఆమె  కన్యగా  వుండి
పోతుంది ,గణాచారి గా  నిలిచి పోతుంది !రానున్న  విపత్తులు  తెలుపుతుంది ,
క్రమంగా  విరన్ననాయుడి  మరణం  తర్వాత అయన  పుత్రుడు  నాగన్న నాయుడు  జమిందారు  అవుతాడు ,
బ్రాహ్మణుడు  చనిపోయి  అయన  కొడుకు  నాగేశ్వర శాస్త్రి  ఆలయాన్ని  చూసుకుంటారు ,గణాచారి  మరణం
పిదప  కాపు  అన్న  కుమార్తె  గణాచారి  అవుతుంది !ఆ  వూరు  సుబ్బన్నపేట !
ఇంతటి  కల్పనా శక్తి  యెవరికి  సాధ్యం !ఒక్కొక్క  పాత్ర  సృష్టి  అమోఘం !
ఒకరు  ప్రతినిధులు ,ఒకరు  ప్రచారకులు ,ఒకరు  వ్యాఖ్యాతలు !
విశ్వ నాథసత్యనారాయణగారికి  శిరస్సు  వంచి  ప్రణ మిల్లుతున్నాను ! 

5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

మలి వయసు మనది

జీవితం  చిన్నది ,జీవనం  మనచేతిలో  వున్నది ,సమయం  పరిమితం ,ఆలోచనలు  అపరిమితం ,అన్నిటి  సమన్వయమే   అనుభవం !సానుకూల  ఆలోచన ,కావాలంటే  ముందుగా  ఆలోచనా  సరళి  వివేకం  నించి  వివేచనలో  సాగాలి . ప్రతి  క్షణాన్ని  అపురూపంగా  ఆస్వాదిస్తూ  నలుగురితో  భావాలు  పంచుకుంటూ  మనల్ని  మనం  మోటివేట్  చేసుకోవాలి . ముఖ్యంగా  భాద్యతలు  ముగిసి  ,పిల్లలందరూ  వారి  వారి  పథంలో  సాగుతున్నప్పుడు   మధ్య  మధ్య  మంచిచెడు  చెప్పి  సక్రమంగా  పయనించేలా  చూడాలి . జీవితం లో మనకంటూ  ఒక  సమయం  వుండాలి . వయసులో  వున్నప్పుడు  చదువు  ఆటలు  స్నేహితులు  యెంతో
వేగంగా  కాలం  కదిలి  పోతుంది .  ఆ  పిదప  మగపిల్లలైతే  వుద్యోగం ,పెళ్లి ,బాధ్యతలు ,పిల్లలు ,వాళ్ల  చదువులు యిలా  కాలం  కదిలి పోతుంది . ఆడపిల్లలైతే  పెళ్లి ,భర్త ,అత్తవారిల్లు ,బాధ్యతలు ,పిల్లలు  చదువులు  కాలం  యిలా
కదిలి పోతుంది . మరి  తనల్ని  గురించి  యెప్పు డు  ఆలోచించాలి ?ప్రతి వారికి  వ్యక్తిగత ఇష్టాలు  భావాలు  వుంటాయి . జీవన సంధ్యలో తను  కోరుకున్న  విధంగా  మలుచుకోవాలి . పిల్లల  మీద  ఆధార పడకుండా
ఆర్ధికంగా  నిలదొక్కుకొని  తామరాకు  మీద  నీటి బొట్టులా  జీవితం  గడపాలి . మన  చుట్టూ  వున్న  పృకృతి
యెన్నో  కథలు  చెపుతుంది . మనసుతో  వింటే  యెన్నో  భావాలు ! మన ఆలోచనలు  నలుగురితో  పంచుకోవాలి . ఎదుటి  వారి  ఆలోచనలకూ  అవకాశం  యివ్వాలి .అంతే  కానీ  మనల్ని  వాళ్లు  సరిగా  చూడలేదు ,వీళ్లు  సరిగా  చూడలేదు  అని  బాధ  పడకూడదు .,మన  ఆరోగ్యం  కాపాడుకుంటూ  యెవరి  మీద  ఆధార  పడకుండా  జీవితం
సాగించాలి !