ద్సష్టిలో ప్రతిజీవి కి మనసు ,హృదయం ,మెదడు వున్నాయి . ప్రతి జీవి తనదైన భాషను వాడుతుంది . అన్ని జీవుల భాషలు అన్నిజీవులకు అర్ధం కావు . భావం ఒకటే అయినా భావప్రకటన భాష వేరు . గోమాత పలికే
"అంబా "లో యెన్నో భావాలు !సునిశితం గా పరిశీలిస్తే ఆ అరుపులో ఆవేశంలో ఒకరకంగా ,ఆవేదనలో ఒకరకంగా ,ఆప్యాయతలో ఒకరకంగా భావాలు పలుకుతాయి . అలాగే ప్రతిజీవి తన భాషలో తనభావాలను తెలుపుతుంది . మనం బుద్ధి జీవులం !బుద్దితో అలోచించి సంస్కారమైన భాష వుపయోగించి భావ ప్రకటన
చేస్తాము .పశువు ఆలోచిస్తుంది , మనం ఆలోచిస్తాం . పశువు ఆలోచనలు సమాజాన్ని ప్రభావితం చెయ్యవు .
కానీ మన ఆలోచనలు భాష ఎదుటి మనిషిని ప్రభావితం చేస్తాయి . అందువల్ల పర్యవసానం ఎలా
వుంటుందో!కాబట్టి ఆలోచనా సరళి సక్రమంగా వుండాలి . ఆలోచన సక్రమం ,ఆచరణ సక్రమం అయితే అందరు హాయిగా వుంటారు . అలేగ్జాందర్ ఎంతో తెలివిగలవాడు కాని ఆలోచన ఆచరణ సరిగా లేవు . చరిత్రలో నిలిచినా నరహంతకుడిగానే నిలిచి పోయాడు . గాంధీజీ ఆలోచన ఆచరణా సక్రమం అవటం వల్ల మహాత్ముడు అయ్యారు ,జాతిపితగా అందరి మనసుల్లో నిలిచిపోయారు .

మన ఆలోచనే మనల్ని విజయపథంలోకి నడిపిస్తుంది . ఆలోచనాప్రవాహానికి దిశా నిర్దేశం కావాలి . ఒకసమస్య దానికి సక్రమ ఆలోచన ,ఆలోచనలోనించి సక్రమ పరిష్కారం ,నిర్మాణాత్మక ఆచరణ యివే మనిషిని మనీషి గా నిలబెడుతాయి . భ్రమలో జీవించ వద్దు ,భ్రమ అనే మత్తులో తేలవద్దు ,సత్యంలో జీవించి సత్యాన్వేషణ చేసినప్పుడే ఆలోచనలు సత్ఫాలిస్తాయి . లేనిది వూహించుకుని ,మెదడును మనసును కలుషితం చేసుకోకూడదు . నిజం లోనించి నిజాయితీ నిలబడాలి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి