మన సాంఘిక వ్యవస్థలో సామాజిక మార్పులు చక చక జరిగి పోతున్నాయి .ఎన్నో యెన్నో మార్పులు .మనం కొన్ని మార్పులు
పరిశీలిద్దాం . కుటుంబ వ్యవస్థలో పురుషుడు ఆర్ధికం గా తన కుటుంబం కోసం శ్రమించి తనవారిని సుఖపెట్టడానికి తపన పడేవాడు స్త్రీ పురుషుడి కి మానసికంగా తోడునీడ గా వుండి అతనికి అన్ని విధాలుగా తోడు నీడ గా వుండి సంసారాన్ని చక్క దిద్దుకునేది . ఉమ్మడి కుటుంబాలు !అత్తగారు ,మామగారు , మరుదులు ,ఆడబిడ్డలు అందరూ కలసి మెలసి సఖ్యత తో వుండేవాళ్ళు . చిన్న
చిన్న విభేదాలు వున్నా వెంటనే పరిష్కరించుకునేవారు . ముఖ్యంగా ఇంటి పెద్ద కు గౌరవం యిచ్చేవారు. ఆయన మాటే వేద వాక్కు
ఇంటి పెద్ద కూడా అంటే పెద్దరికం తో హుందాగా ఉండేవారు .అసందర్భ ప్రేలాపనలు , అహంకారం చూపించకుండా తన గౌరవాన్ని
నిలుపుకునే వారు .కుటుంబ సభ్యులందరినీ ఒక పద్ధతిలో నడిపే వారు .అత్తగారు కూడా కోడలిని తన పిల్ల లాగానే చూచుకుని
మంచి చెడూ చెప్పేవారు .కుటుంబంలో శుచి శుభ్రం ,నిత్యపారాయణం అన్ని పద్ధతి గా జరిగి పోతూ వుండేవి.అలాంటి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలు కూడా చక్కటి మానసిక దృక్పథం తో పెరుగుతారు . చిన్నతనం లోనే చక్కటి సంస్కార బీజాలు నాటుకున్నందువలన వారు పెద్దయిన తర్వాత సంస్కారవంతమైన పౌరులుగా కుటుంబానికి ,సమాజానికి ,దేశానికి దిశానిర్దేశకులు
అవుతారు .
నేటి ప్రస్తుత కుటుంబ వ్యవస్థ పరిశీలిద్దాం !పురుషుడు యిప్పుడు కూడా ధనార్జనే ధ్యేయం గా వున్నాడు .కానీ సమాజపు కొన్ని
ఆకర్షణలకు గురి అవుతున్నాడు .ఉమ్మడి కుటుంబాలు లేవు .ఇంటి పెద్ద అనే మాటే లేదు . తప్పు ఒప్పులను దిద్దే పెద్ద లేరు .
క్రమంగా మాబాసిక దౌర్బల్యం ఒక దురలవాటు గా మారుతున్నది .ఆర్ధిక చిక్కులు మొదలవుతాయి . ఇంటి ఇల్లాలు కూడా
సహనాన్ని కోల్పోతున్నది .ఇల్లు రణరంగం అవుతున్నది . ఎప్పుడయితే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందో అప్పుడే
కుటుంబ పతనం ప్రారంభం అవుతుంది !విలువలు దిగజారుతాయి . ఆ ప్రభావం పిల్లలమీద పడుతుంది . ఇక వారి పతనం మొదలవుతుంది . అవగాహన లేని పెంపకం లో అయోమయ అవస్థలో ఒక ధేయం లేకుండా పెరుగుతారు . ఎందుకూ పనికి
రాని పౌరులుగా తయారు అవుతారు . క్రమంగా చేతకాని తనం కాస్తా ఉగ్రవాదం అవుతుంది . దేశాన్ని కే సమస్య గా తయారవుతారు .
విశ్లేషిస్తే ఈనాటి మన కుటుంబ వ్యవస్థ లో స్త్రీ పురుషుడు ఇద్దరూ ఒకరికొకరుగా ఉండడం తగ్గిపోతున్నది . భార్యగా అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు . అలాగే పురుషుడు కూడా తన భార్య కష్ట సుఖాలను అర్ధం చేసుకోవడం లేదు . ఇద్దరి మధ్య ఆర్ధిక సంబంధం తప్ప అనురాగ సంబంధం అదృశ్యమవుతున్నది. స్త్రీ సమాన హక్కుల కోసం ప్రశ్నిస్తున్నది .నాదృష్టి లో
పురుషుడి లో ఏనాడు అర్ధభాగమయ్యిందో ఆనాడే ఆమెకు అన్ని హక్కులు వచ్చాయి . బాధ్యతలు వున్ననాడు హక్కులను
ప్రశ్నించ వచ్చును . స్త్రీ పురుషులిరువురు మమతానుబంధాలతో జీవన యానం జరిపితే వారి పిల్లలు కూడా చక్కని సంస్కారవంతమైన పౌరులుగా తీర్చి దిద్దబడతారు .
పాఠకులారా అన్ని కుటుంబాలు ఇలా వున్నాయని నేను చెప్పటం లేదు . కానీ నేడు వారి శాతం యెక్కువగా వున్నది . ప్రస్తుత
పరిణామాలు చూచిన తర్వాత నాలోని ఆవేదనకు అక్షర రూపం ఇచ్చాను . ఎక్కడయినా తప్పుగా నేను వ్రాస్తే దయచేసి
నన్ను మన్నించమని మనవి చేస్తున్నాను .ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ! సానుకూలంగా అర్ధం చేసుకుంటారని ఆశిసుస్తున్నాను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి