21, జులై 2016, గురువారం

10th  క్లాస్  వరకు  పిల్లలు  కేవలం  టీచర్  చెప్పినట్టుగా  చదువుకుంటారు . వాళ్ళకంటూ  ఆలోచన  అవకాశం  రాకుండా  టీచర్  ఊపిరి          
సలపనంత వర్క్  యిచ్చి  పూర్తిగా  ఆధారపడేవిధం  గా తయారు  చేస్తున్నారు .ఖర్మ  కాలి యే పిల్లవాడైనా సందేహాలడిగితే  కొందరు  టీచర్లు      
 కసిరి  కూర్చోబెడతారు .కొందరు  టీచర్లు   మాత్రం  ఓపికతో  వారి  సందేహాలు  తీర్చడానికి  ప్రయత్నిస్తారు . అసలు  అంకం  యిక్కడే మొదలు !
 సందేహాలకు  కొద్దిగా  సమాధానాలు  దొరికిన  పిల్లవాడికి  చదువులో  ఆసక్తి  కలిగి  స్వయం  సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు
అలంటి  విద్యార్థులు  జీవితం లో  పైకి  వస్తారు .కానీ  వారికీ  ఇంట్లో  కూడా  ప్రోత్సహం  వుండాలి.తల్లి  తండ్రులకి  విద్యార్ధులకి  అభివృద్ధిలోకి
 రావాలనే  తీవ్ర  సంకల్పం  వుండాలే కానీ  డబ్బు ,వసతి  సమస్యే  కాదు !వీరి శాతం  తక్కువ ! చదువు  మీద  ఆసక్తి  ఉంన్నా అడుగడుగునా
నిరుత్సహపరచే   పరిస్థితులు  యెదురైతే  జీవితం  కొంత  గందరగోళం  అవుతుంది .అలంటి  పరిస్థితులలో  కూడా  స్వయం  కృషి తో  పైకి        
వచ్చిన  వాళ్ళు  వున్నారు . ఇకపోతే  కొందరు  తల్లితండ్రులు  కేవలం  డబ్బు  వున్నదని  అహంకారం  తో అడుగడుగునా  ప్రతి  విషయాన్ని    
 డబ్బుతో  పోలుస్తారు !చదువును  కూడా  కొనాలనే  చూస్తారు .పిల్లవాడికి  చిన్నప్పటినించి  ధనమదం ఒకవిధం గా  పెద్దవాళ్ళే  నేర్పుతారు .
చదువు కో అక్కర్లేదు  చదువు  కొంటె  చాలు  అనే  అవగాహనతో  పెరుగుతారు . తల్లితండ్రుల  సపోర్ట్  కూడా  తోడవుతుంది .
 ఇంటర్మీడియట్  లో  యీ మూడు  రకాల  వాళ్ళు  వారికీ  తగ్గ  విధం  గా  చదువుకుని   రెండేళ్లు  పూర్తీ చేస్తారు .ఎంసెట్  యీ  రోజుల్లో
ఒక  ప్రహసనం  అయ్యింది .ప్రతివారు  వ్రాస్తున్నారు ! రిజర్వేషన్  పుణ్యమా  అని  రాంక్  యెంత  అయినా  పర్వాలేదు  సీట్  ఖాయం .
 ఇందులో పేపర్  లీకులు !పేపర్  కొనుక్కోవడాలు !అసలు  మన విద్యా వ్వ్యవస్థ  పురోగమనమా తిరోగమనమా ? అవగాహన,ప్రాక్టికల్  అనుభవం  లేని  చదువులు  ఎందుకు ? వ్యక్తిగా  యెదగనివ్వని చదువులు  ఎందుకు ? చదువులు  వ్యక్తిత్వ  వికాసానికి  తోడ్పడాలి , మనిషి
యెదుగుదలకి తోడ్పడాలి .విద్యారంగానికి  యెన్నో కోట్లు  ఖర్చు  పెడుతున్నారు . ఫలితాలు  మాత్రం  ఆశించినంత  స్థాయిలో  లేవు !కారణం  పెద్దలు  ఆత్మవిమర్శ  చేసుకోవాలి !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి