వేయిపడగలు తొలి రెండు అధ్యాయాలలో ప్రాముఖ్యత గల పాత్రలు ---రామేశ్వర శాస్త్రి ,కృష్ణమనాయుడు ,వారి ఆప్యాయతలు మరియు స్నేహబంధం !తొలుతగా నా దృష్టి లో ,
రామేశ్వర శాస్త్రిగారు ---ఈయన సుబ్బన్న పేటలో 5వ తరానికి చెందిన వ్యక్తి -సుందర రూపి ,ఔదార్యులు ,పాండిత్య ప్రతిభ కలవారు .నాలుగు వర్ణముల వారిని పెళ్లి చేసుకున్నారు ,అంతే కాక రత్నగిరి అనే భోగంగాన ను చెరదీసా రు . అయన లోని యితర సుగుణముల వలన ,ఆయన చేసుకున్న వివాహముల
విషయాలు మరుగున పడుతాయి . అలాగే భార్యల పట్ల అయన ప్రవర్తించిన తీరు కూడా చాలా హుందాగా
వున్నది . తనకున్న ధనం అందరి అవసరాలకు వాడుతారు ,నిరతాన్న దాత !ప్రజాక్షేమం కోరే వ్యక్తిగా అందరి మన్ననలు పొందుతారు . ఆలయంలో ధ్వజస్తంభానికి బంగారపు తొడుగు వేయించడం ,సత్యభామాదేవికి మాణిక్యము పొదిగిన అడ్డబాస చేయించడం .ఈ పనులన్నీ శాస్త్రి గారి లలితభావ జలాన్ని కళ్ళముందు నిలబెట్టుతాయి ,కొన్ని కొన్ని సంఘటనలను చదువుతుంటే విశ్వ నాధులే కళ్ళ ముందు నిలుస్తారు .
ఇల్లు గడవని రోజులలో కూడా వితరణ గుణం మనల్ని కట్టి పడేస్తుంది ,రామేశ్వర శాస్త్రి పాత్ర సజీవ పాత్ర
కృష్ణమనాయుడు -రాజు ,పురోహితులు వ్యవస్థను సక్రమంగా నడిపినప్పుడే సమాజం వర్ధిల్లుతుంది .
నాయుడు గారు ,శాస్త్రిగారు ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ స్నేహబంధాన్ని నిలుపుకుంటారు . వారి మనసులు మాట్లాడుకుంటాయి ,నాయుడుగారు శాస్త్రిగారి అప్పులన్నీ చాలా చాకచక్యంగా తీర్చి ధర్మారావుని ఆదరించిన తీరు వర్ణ నాతీతమ్ !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి