మన భారత దేశం వున్నత విలువలకు నెలవైన బంగారు పాలవెల్లి . మానవీయ విలువలకు ప్రపంచదేశాల కే
తలమానికం !అన్నిదేశాల ప్రజలు సమాజంలో ఎలా మెలగాలో భారతియసమాజం దగ్గర నేర్చుకున్నారు .
ఆ నాటి ఆ మహోన్నత విలువలే ఈ నాటికి మన భారతీయుడు కనపడగానే అప్రయత్నంగా రెండు చేతులు జోడించి అంజలి ఘటించే లా చేసాయి . కానీ ఈ మాధుర్యం గతం లో కి జారింది . నేడు ఆ సంస్కృతి ఎక్కడ !
మన నడవడి ఎందుకిలా జారింది !పశ్చిమ దేశాలు వారి సంస్కృతిని మన మీద బలవంతంగా రుద్దలేదు .
వారిలోని అలవాట్లను మన జీవన విధానానికి అనువైనవి మనం గ్రహించాలి !వారి వాతావరణ నాగరిక
ప్రభావం వారి జీవనవిధానం!వారికి మనలాగా తరతరాల చరిత్రలేదు .ఆటవిక జీవనం లో నించి బాహ్య
ప్రపంచం లో కి వచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు సంస్కారాన్ని సంస్కృతిని వెతుకుతున్నారు మరి మనపెద్దల ద్వారా లభించిన అపార సంస్కార సంపద వుంది ,చెరగని సంస్కారం వుంది ,కారణం ఏమిటి ఎందుకిలా తయారవుతున్నాము ?బయటి వాళ్ళెవరు మనల్ని యిలా వుండమని ప్రోత్సహించడం లేదు ,మన మానసిక దౌర్బల్యమ్ మనల్ని పతనం లోకి లాగుతున్నది !మనకు అన్ని సుఖాలు అనుభవించడం అలవాటయింది ,దాని వల్ల మంద బుద్ధి ,బద్ధకం మొదలయ్యాయి . .టెక్నాలజీని వాడుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకొమ్మన్నారు కానీ దుర్వినియోగము చేసుకోమన లేదు !మన దైనందిక కార్యాలను త్వరగా ముగించుకుని ,మనలోని చైతన్యాన్ని ఆలోచనలను క్రమ దిశలో వాడుకోవడమే టెక్నాలజీ యొక్క లక్ష్యం !ప్రస్తుత దారుణ మైండ్ సెట్ మారాలి ,వక్ర ఆలోచనలను తుంచి వేయాలి ,ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ప్రోగ్రాములను కట్టడి చెయ్యాలి ,అశ్లీ ల సాహిత్యాన్ని ,దృశ్యాలను కట్టడి చెయ్యాలి ,!
గృహ వాతావరణం లో చక్కటి సంభాషణలు ,చక్కటి సంస్కారం వుండాలి ,బూతు మాటలు ,వెక్కిరింతలు ,హేళన మాటలు ,వుండకూడదు !ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతిమాట ప్రతి చర్య ,చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా వుండాలి ,ఇళ్ళల్లోని క్రమ పద్ధతులే యువతకు క్రమ శిక్షణ నేర్పుతాయి !.అలాగే యువత కూడా చదువు తో పాటు ఏదో ఒక లలిత కల మీద పట్టు సాధించాలి !శారీ రికంగా అలసి పోయినప్పుడు మధుర సంగీతం
మనసుకు హాయి కలిగిస్తుంది !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి