వేయిపడగలు -- 4వ అధ్యాయము --
గత 3అధ్యాయాలు గతవైభవాన్ని తెలుపుతాయి . 4వ అధ్యాయము లో మారుతున్న మనుషుల మనస్వత్తాన్ని చాలా బాగా తెలిపారు . రంగారావు పట్టాభిషేకం !రంగారావు గారి తండ్రి నాయుడుగారు
ప్రజల వ్యవహారం లో చాలా వుదారం గా వుండేవారు .ప్రజల అన్ని అవసరాలు ఆదుకునేవారు .అంతే కాదు కళా పోషకులు కూడా ! విశ్వనాథ సత్యనారాయణగారు కోటను వర్ణించిన తీరు !'కోట కు సింహ ద్వారమొకటి వెనుక ద్వారమొకటి వుండెను . కోట ఆంగ్లేయులు పూర్తి గా దేశము స్వాధీ నము కానపుడు కట్టినది కాన
కోటగోడ కొండ రాతితో కట్టబడి ఒక శక టము సునాయాసముగా పోవుటకు వీలైనంత యెడము కలదై కందకమును కూడా కలిగి వుండెను . కందకము పాడుపడి వున్నది . వూరున్న వైపు కందకము పూడ్చ బడి వున్నది . కొన్ని యెడల కోటగోడ శిథిల మై పోయెను . అది మరల మరమ్మత్తు చేయుటకు దొరతనము వారి అనుమతి లేక యట్లే వున్నది . '
కోట వర్ణన చదువుతుంటే అసలు మనం కోట పక్కన నిలుచున్న భావం కలుగుతున్నది కదూ !తెల్లదొరల
పాలన లేనప్పుడు ప్రజలు యెంత స్వేచ్ఛగా వున్నారో యెంత హాయిగా వున్నారో అలాగే తెల్లదొరల పాలనలో కోట మరమ్మత్తుకు కూడా వారి అంగీకారం కావలసిన దయనీయ స్తితిని తెలుపడం లో కవి ఆనాటి సమాజపు మనిషి ఆలోచనలను తెలిపారు .
మరో వర్ణన 'కోట విశాలమైన పదివేల మంది జనులు సుఖముగా నివసించుటకు వీలై నదిగా వుండెను . కోటలో నెల్లెడ వున్నతములైన వృక్షములు దిగుడు బావులు ఫల వృక్షములు బహు జాతులు గల
తీ వలు కలవు !కోటలో దక్షిణ దిశ యందు పెద్ద సావడి లో బోనులలో సమర్పబడి పులులు
చిరుతలు సివంగులు కొరనాసి గండ్లు కోతులు మొదలైన అపూర్వ జంతువులు నానాజాతి పక్షులును
పెంచబడుచుండెను !వానిని చూచుటకు కొత్త వారెప్పుడును వచ్చుచునే యుందురు !కోటయే వస్తు ప్రదర్సన
శాల ;కోటయే పుస్తక భాండాగారము ;కోటయే విద్యా పోషణ సం స్థ !కోటయే తల్లి !కోటయే తండ్రి !కోటయే
స ర్వముగా యుండేది '
కవి భావుకత కవి కాల్పనిక శక్తి యెంతో యెంతో మధురం !అసలు ఆయన వేయి పడగలలో జీవించారు !
ప్రతి చిన్న అంశము చదువుతుంటే మనం కూడా అక్కడ ఒక పాత్రగాజీవిస్తాం
కవి సార్వభౌమా మీకు శిరస్సు వంచి ప్రణ మిల్లుతున్నాను !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి