కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి వేయి పడగలు చదవని తెలుగు వారు వుండరేమో !రచనా శిల్పం వూహకు అందనిది ,కేవలం 29 రోజులలో ఆశువుగా చెప్పడం ,వారి సోదరులు వ్రాయడం ,మానవ మాతృ కులకు సాధ్యమా ?మన తెలుగు వారు చేసుకున్న పూర్వజన్మ పుణ్యమే అయన ఆవిర్భావం !కల్పనా శక్తి
పాత్రల సృష్టి ,అభ్యుదయ శైలి ,పదాల పొందిక నన్ను పరవశింప చేసింది .
సుబ్బన్నపేట పుట్టుక _ఒక పెదకాపు తన సురభి అనే గోవు పుట్టలోని సర్పానికి పాలు యివ్వడం చూసి
ఆశర్యంతో తన వారికి చెప్తాడు . ఆ రాత్రి అతనికి వేయి శిరస్సులతో సుబ్ర మ ణ్యె శ్వరుడు గుడి కట్టమని పలుకుతాడు . పాపం వారి ఆర్ధిక లేమితో నిస్సహాయులు !పొరుగు గ్రామం లో ఒక ఆస్తిపరుడైన బ్రాహ్మణుడు
తనకు సంతానం కలిగితే స్వామి సన్నిధిలో వుండి ఆలయ ప్రయత్నం చేస్తానని మ్రొక్కుకుంటాడు . ఆ పిదప
అతనికి పుత్రోదయం !నాగేశ్వర శాస్త్రి నామకరణం !ఆ యన స్వామివద్దకు చేరుతారు ,ఆలయ నిర్మాణం ఆలోచిస్తారు . అయన జ్యోతిష్య ,వాస్తు బాగా తెలిసినవారు ,ఒకరోజు యీయన వద్దకు వీరన్న అనే వ్యక్తి వస్తాడు . అతని వద్ద గల ధనముతో కోటకట్టి జమిందారు అవ్వాలన్న కోరికను వెలిబుచ్చుతాడు . తానున్న
ప్రదేశమే కోటకు యోగ్యమని బ్రాహ్మణుడు చెప్తారు . ఆలయనిర్మాణం ,కోట నిర్మాణం మొదలవుతాయి .
ఆలయం లో సుబ్రమ ణ్యె శ్వరులు ,నాగేశ్వర స్వామి ,కొలువవుతారు . విరన్ననాయుడు వేణుగోపాల స్వామి ఆలయం కూడా నిర్మిస్తారు .,ఆలయ నిర్మాణం తో అన్ని వసతులు ఏర్పడు తాయి ,
కాపు కు ఒక్కతే కూతురు ! ఆ అమ్మాయిలోకి అప్పుడప్పుడు స్వామి ఆవేశి స్తారు ,ఆమె కన్యగా వుండి
పోతుంది ,గణాచారి గా నిలిచి పోతుంది !రానున్న విపత్తులు తెలుపుతుంది ,
క్రమంగా విరన్ననాయుడి మరణం తర్వాత అయన పుత్రుడు నాగన్న నాయుడు జమిందారు అవుతాడు ,
బ్రాహ్మణుడు చనిపోయి అయన కొడుకు నాగేశ్వర శాస్త్రి ఆలయాన్ని చూసుకుంటారు ,గణాచారి మరణం
పిదప కాపు అన్న కుమార్తె గణాచారి అవుతుంది !ఆ వూరు సుబ్బన్నపేట !
ఇంతటి కల్పనా శక్తి యెవరికి సాధ్యం !ఒక్కొక్క పాత్ర సృష్టి అమోఘం !
ఒకరు ప్రతినిధులు ,ఒకరు ప్రచారకులు ,ఒకరు వ్యాఖ్యాతలు !
విశ్వ నాథసత్యనారాయణగారికి శిరస్సు వంచి ప్రణ మిల్లుతున్నాను !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి