తరువులన్నీ యిచ్చిన చిన్ని చిన్ని విత్తనాలను తెచ్చుకున్నాను ,
పొందికగా అందంగా నా చిన్ని తోటలో చల్లుకున్నాను ,
నారు పోసి నీరు పోసి కలుపు తీసి కళ్ళతో కాపాడుకున్నాను ,
ఎదుగుతున్న మొక్కలను తడికళ్ళతో తనివితీరా చూసాను ,
చిన్ని సన్నజాజి తీగ నన్ను చుట్టేసింది ,
ఎర్ర గులాబీ తమకంతో నన్ను ముద్దాడింది ,
పరువాల చామంతి పకపకా నవ్వింది ,
ఓరగా కోరగా మామిడి పిందె నన్ను చూసి కళ్ళు తిప్పింది ,
అందాల నా తోటలో తరులు విరులు నవ వసంత రాగ రంజితాలు ,
ఋతువులన్ని కాలగతిలో చక చకా తిరిగాయి ,
మొక్కలన్నీ రెక్కలొచ్చి యెగిరి పోయాయి ,
తరులన్నీ తెరవు కోసం తరలిపోయాయి ,
ఒకనాటి వసంతాన్ని బీడుపడిన నా తోటలో ,
మసక బారిన కన్నులతో వేయి కళ్ళతో వెతికాను ,
కానరాక వేదనతో కనుకొలకుల కన్నీరుతో తరలిపోయాను నేస్తమా !!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి