వేదాలు ఘోషించె నాటి భారతం!
రేవులో తూలి సోలి వూగె నేటి భారతం !
ఓంకార ప్రణవం నాటి భారతం !
మరణ మృదంగం నేటి భారతం !
పుణ్య మంత్రాల పునీతం నాటి భారతం !
మానభంగాల పర్వం నేటి భారతం !
పుడమి తల్లి పచ్చల హారం నాటి భారతం !
పుల్లలైన బీడుభూమి నేటి భారతం !
ప్రభవించిన పౌరుషం నాటి యువ భారతం !
మత్తులో మనసు చచ్చిన నేటి యువభారతం !
జాతి గౌరవింప జన జీవన స్రవంతిలో ,
చైతన్య యువ కిరణమై నేటి భారతం లో ,
నాటి భారత భావ జలధిగా సాగిపో మిత్రమా !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి