24, ఏప్రిల్ 2018, మంగళవారం

మిత్రులారా  ! శుభోదయం ! ప్రపంచ  దేశాలు   మనదేశాన్ని  వారి  సాంఘిక  సామజిక  ఉన్నతికి     మార్గ  సూచిక  గా 
అభివర్ణించాయి !భారతీయ  కుటుంబ  వ్యవస్థ   ఆప్యాయత ,అనుబంధాలతో  ముడిపడింది ! భారతీయ  విద్యావిధానం     పిల్లలను సంస్కరించింది !క్రమశిక్షణను  నేర్పింది !తల్లితండ్రులు ,గురువులు ,బాల్యం  లోనే  విచక్షణ  వివేకం  ఉగ్గుపాలతో  రంగరించారు !గృహ వాతావరణం  లో  స్త్రీ పట్ల గౌరవం  సద్భావాన్ని  నేర్పారు ! మగపిల్లవాడికి  ఆడపిల్లల 
పట్ల  మెలగవలసిన పద్ధతులను  తెలిపారు !హద్దుదాటని  సంస్కారం  నేర్పారు !మరి నేడు  భారతదేశం  లో  యెందుకు 
యిన్ని అత్యాచారాలు ,యెందుకు  యిన్ని  మానభంగాలు ? చిన్ని పాపాయి  యే పాపం  చేసింది ? పాఠశాల కుర్రవాడు
 పాశవిక ఆలోచనలు  ఎలావస్తున్నాయి ? ఎక్కడుంది లోపం ?తల్లి పెంపకమా?గారాబంగా ? స్వార్ధమా?ఆడపిల్ల   
అంటే  చులకన  భావమా?దయచేసి  మిత్రులారా  మీ  విశ్లేషణ  తెలపగలరు ౧ ఇలాగే వ్యవస్థ  కొనసాగితే  భవిష్యత్తులో   అనాగరిక సమాజం  యేర్పడుతుంది!దానికి  మనమంతా  బాధ్యులమే !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి