9, ఫిబ్రవరి 2017, గురువారం

సృష్టి  లో  ప్రతిజీవికి  మనసు  వున్నది ,హృదయం  వున్నది . ఆలోచించే  శక్తివుంది.ప్రతిజీవి  తనలోని  హృదయ  భాషను  బహిర్గతం  చేస్తుంది !కానీ  అన్నిజీవుల  భాషలు  అన్ని  జీవులకు  అర్ధం  కావు . భాష  ఒకటే అయినా  భావ  వ్యక్తీకరణ  వేరు !చెప్పాలంటే  గోవు  పిలిచే  ' అంబా ' అనే పిలుపు  ఆవేదన లో  ఒక  రకం  గా ఆవేశం  లో  ఒక రకం గా ఆనందం లో  ఒకరకం  గా పలుకుతుంది .మనం ప్రతి రోజు  గోవును  గమనిస్తే   ఆలోచనకు  అనుగుణం  గా  భావాన్ని వ్యక్తం  చేస్తున్నట్టు  తెలుస్తుంది .మనం  కూడా  ఆలోచిస్తున్నాము  భావాలను  తెలుపుతున్నాము .కాకపోతే  మనకు అన్యజీవులకు  ఒకేఒక్క  తేడా  వున్నది !మన  ఆలోచనలు ,భాష ,భావం  సమాజాన్ని ప్రభావితం  చేస్తుంది .అందువల్ల పరిణామాలు  వాటికనుగుణం  గా  వుంటాయి!ఆలోచన  సక్రమమై ఆచరణ సక్రమమైతే  సమాజం  సలక్షణం  గా  వుంటుంది! ఆలోచన  వక్రం,ఆచరణ  వక్రం  ఆయితే సమాజం  విలక్షణం  గా  వుంటుంది ! మనసు కు  మంచి  ఆలోచన మంచి ఆచరణ  కావాలి ,ఆలోచనా ప్రవాహానికి  దిశానిర్దేశం  కావాలి !దిశానిర్దేశానికి సాహిత్యం  యెంతో దోహదం  చేస్తుంది అలాగే  మన  భావాలను  నలుగురి తో  పంచుకుంటే  కొన్ని  మనకు  తెలియని  ఆణిముత్యాలు  బయటికి  వస్తాయి !     సత్యం  లో  అలోచించి  సత్యాన్వేషణ  చేసినప్పుడే  ఆలోచనలు  మంచి ఫలితాన్ని  యిస్తాయి,భ్రమలో జీవించవద్దు భ్రమ  లో  ఆలోచించవద్దు !ఆలోచన విజయాపథం  లో  నడిస్తే  ఆచరణకు   సమాజం  నీరాజనం  పడుతుంది !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి